Begin typing your search above and press return to search.
ఆ టైమ్ లో కరోనా బారినపడటమే నా బ్యాడ్ లక్: నివేదా థామస్
By: Tupaki Desk | 17 April 2021 12:30 PM GMT'వకీల్ సాబ్' సినిమాలో పవన్ కల్యాణ్ .. ప్రకాశ్ రాజ్ తరువాత నివేదా థామస్ పాత్ర ప్రాధాన్యతను సంతరించుకుని కనిపిస్తుంది. ఈ సినిమాలో కథ అంతా కూడా ఆమె పాత్ర చుట్టూనే తిరుగుతుంది. ఈ నెల 9వ తేదీన విడుదలైన ఈ సినిమా, తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా, ఓవర్సీస్ లోను వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లోగానీ .. ప్రమోషన్స్ లో గాని నివేదా థామస్ కనిపించలేదు. ఆ సమయంలో ఆమె కరోనా బారిన పడటమే అందుకు కారణమనే టాక్ వినిపించింది. తాజా ఇంటర్వ్యూలో ఆమె ఆ విషయాలను గురించి ప్రస్తావించింది.
"కరోనా రావడం ఒక బాధ అయితే .. ఈ టైమ్ లోనే రావాలా? అని నేను ఇంకా బాధపడిపోయాను. 'వకీల్ సాబ్' సినిమా ప్రమోషన్స్ లో పాల్గొనలేకపోవడం .. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో భాగం కాలేకపోవడం వెలితిగా అనిపించింది. ఆ స్టేజ్ఈ పై తాను ఉంటే బావుండేదనిపించింది. ఈ సినిమా గురించిన అనుభవాలను ప్రత్యక్షంగా పంచుకోలేకపోయానే అనిపించింది. ఆ రోజున ఆ వేదికపై నేను ఉంటే పవన్ సార్ కి .. దిల్ రాజు గారికి .. వేణు సార్ కి థ్యాంక్స్ చెప్పేదానిని. ఈ సినిమా ఇంత బాగా రావడానికి కారకులు వాళ్లే. అదే విషయాన్ని ఈ వేదిక ద్వారా వాళ్లకి తెలియజేస్తున్నాను.
ఈ సినిమాను నేను థియేటర్లో చూశాను .. పవన్ ఇంట్ట్రడక్షన్ సీన్ కి .. మెట్రో ట్రైన్ లో యాక్షన్ సీన్ కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూసి నాకు చాలా హ్యాపీగా అనిపించింది. 'మగువా .. మగువా' పాటను స్క్రీన్ పై చూస్తున్నప్పుడు నాకు కలిగిన ఫీల్ నేను మాటల్లో చెప్పలేను. ముఖ్యంగా కోర్టు రూమ్ సీన్స్ నన్ను బాగా ఆకట్టుకున్నాయి. పవన్ కల్యాణ్ రీ ఎంట్రీ సినిమాలో నాకు ఛాన్స్ రావడం ... ఈ సినిమా హిట్ కావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇలాంటి పాత్ర పడటం .. నా నటనకు ప్రశంసలు దక్కుతుండటం ఆనందంగా ఉంది" అని చెప్పుకొచ్చింది.