Begin typing your search above and press return to search.
'జై లవకుశ' తర్వాత గ్యాప్ ఎందుకు?
By: Tupaki Desk | 27 Feb 2019 5:30 PM GMTజెంటిల్ మేన్ - నిన్నుకోరి లాంటి హిట్ చిత్రాల్లో నటించిన నివేద థామస్ చక్కని ప్రతిభావని అన్న పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం 118 చిత్రంలో నటిస్తోంది. కళ్యాణ్ రామ్ ఈ చిత్రంలో కథానాయకుడిగా నటించారు. గుహన్ దర్శకత్వం వహించగా - మహేష్ కోనేరు నిర్మించారు. మార్చి 1న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం రిలీజ్ కానుంది. ఈ సినిమా గురించి నివేద మాట్లాడుతూ.. ప్రతిక్షణం ఉత్కంఠకు గురి చేసే అద్భుత చిత్రమిది. చివరి 20 నిమిషాలు నా పాత్ర ఆకట్టుకుంటుంది. మునుముందు జరిగేది ఇప్పుడే మనకు తెలిసిపోతే ఆ తర్వాత ఏం జరుగుతుంది? అనే ఉత్కంఠభరితమైన కథాంశంతో తీస్తున్న చిత్రమిది. ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టుగా కళ్యాణ్ రామ్ నటన ఆకట్టుకుంటుంది అని తెలిపారు నివేద.
అన్వేషణతో పోలిక ఉంటుందా? అన్న ప్రశ్నకు.. అలా ఏమీ ఉండదని - సస్పెన్స్ థ్రిల్లింగ్ ఎలిమెంట్ మాత్రం అలా ఉంటుందని అన్నారు. అన్వేషణ టైటిల్ వరకూ ఎంపిక చేసుకోవాలని అనుకున్నారు. ఇక నేను ఆ చిత్రం చూడలేదు. అందులో భానుప్రియ నటించారని తెలుసు. తన నటన అద్భుతంగా ఉంటుంది.. అని అన్నారు నివేద. ఫైనల్ డెస్టినేషన్ తరహా లైన్ ఉంటుందా? అన్న ప్రశ్నకు .. థీమ్ ఉన్నా పోలిక ఉండదని తెలిపారు.
జై లవకుశ తర్వాత ఎందుకు అంత గ్యాప్ తీసుకున్నారు? అన్న ప్రశ్నకు.. ఆ సమయంలో థీసిస్ చేసేందుకు వెళ్లానని తెలిపారు. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసాను.. అందుకే జై లవకుశ తర్వాత ఆరు నెలలు గ్యాప్ తీసుకున్నా. సినిమా ఎలాగో అఆనే చదువులు కూడా నాకు చాలా ఇష్టం. అందుకే అప్పట్లో గ్యాప్ తీసుకున్నాను... అని నివేద వెల్లడించింది. ఇకపై పూర్తిగా కెరీర్ పైనే దృష్టి సారిస్తానని తెలిపారు. కళ్యాణ్ రామ్ పాత్ర గురించి ప్రస్థావిస్తూ.. అతడికి కలలు వస్తుంటాయి. ఇది ముందే జరిగినట్టు ఊహకు తెలుస్తుంది. ఒక రూమ్ లోకి వెళ్లినప్పుడు ఇది ఇంతకుముందే అయ్యిందే.. అన్న స్ఫురణ వస్తుంటుంది. ఇదే ప్లేస్‌లో ఇంతకుముందు జరిగింది.. అంటూ పరిశోధించే జర్నలిస్టు చివరికి ఏం కనుగొన్నాడు? అన్నది ఆసక్తికరం. కళ్యాణ్ రామ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టుగా నటించారు. నాజర్ డాక్టర్ గా కనిపిస్తారు. ఫిక్షన్ ఎలిమెంట్ మైమరిపిస్తుందని నివేద ఇంటర్వ్యూలో తెలిపారు.