Begin typing your search above and press return to search.

నంద‌మూరి బ్రద‌ర్స్ పై నివేద కామెంట్‌

By:  Tupaki Desk   |   28 Feb 2019 4:19 AM GMT
నంద‌మూరి బ్రద‌ర్స్ పై నివేద కామెంట్‌
X
నివేద అంటే స్వీట్ నెస్ .. క్యూట్ నెస్.. నివేద అంటే ల‌వ్‌ లీ అప్పియ‌రెన్స్ అన్నంత‌గా పాపుల‌రైంది. `జెంటిల్‌ మెన్‌`, `నిన్నుకోరి` చిత్రాల‌తో అది ప్రూవైంది. ఈ మ‌ల్లూ బ్యూటీలో ఉన్న వేరొక గ్రేట్ క్వాలిటీ నాలుగు భాష‌ల్లో(తెలుగు.. త‌మిళం.. మ‌ల‌యాళం.. ఇంగ్లీష్ ) తూటాలు పేల్చేంత‌గా స్ప‌ష్టంగా మాట్లాడే చాతుర్యం. ఎదుటివారిని ముగ్గులోకి దించేంతగా మాట తీరు ఆక‌ట్టుకుంటుంది. ఆ సంగ‌తి త‌న‌ని ఇంట‌ర్వ్యూలు చేసే మీడియాకి తెలుసు. బ్యాలెన్సింగ్ స్పీచ్‌ లో ఈ అమ్మ‌డిని కొట్టేవాళ్లే లేరు. జైల‌వ‌కుశ త‌ర్వాత ఏమైంది ఈ అంద‌గ‌త్తె అనుకుంటుండ‌గానే .. ఇప్ప‌టికి తిరిగి పూర్తి స్థాయిలో బ‌రిలోకి వ‌చ్చేలా ప్లాన్ చేసుకున్నాన‌ని చెప్పింది. ఆర్నెళ్ల పాటు థీసిస్ కోసం సెల‌వులు తీసుకున్నాన‌ని - అందుకే జై ల‌వ‌కుశ త‌ర్వాత క‌నిపించ‌లేద‌ని తెలిపింది.

నివేద న‌టించిన 118 మార్చి 1న రిలీజ‌వుతున్న సంద‌ర్భంగా ప‌లు ఆస‌క్తిక‌ర సంగ‌తుల్ని ఈ అమ్మ‌డు చెప్పింది. ముఖ్యంగా నంద‌మూరి బ్ర‌ద‌ర్స్ గురించి నివేద చెప్పిన ఛ‌మ‌క్కుల‌పై మీడియాలో ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగింది. అన్న‌ద‌మ్ములు ఎన్టీఆర్ - క‌ళ్యాణ్ రామ్ ఇద్ద‌రితో ప‌ని చేశాను. ఆ ఇద్ద‌రికీ తమ తోటి నటీనటుల్ని గౌరవించే సంప్రదాయం ఉంది. వాళ్ల మాటల్ని ఎప్పటికీ మర్చిపోను.. అని అంది. ఇటీవ‌లే 118 ప్రీరిలీజ్ వేడుక‌లో నివేద న‌ట ప్ర‌తిభ‌ను ఎన్టీఆర్ అద్భుతంగా ప్ర‌శంసించారు. అలాగే క‌ళ్యాణ్ రామ్ సైతం నివేద న‌ట‌న గురించి ప‌దే ప‌దే ప‌బ్లిక్ వేదిక‌ల‌పై ఆకాశానికెత్తేస్తున్నారు. మొత్తానికి నంద‌మూరి నాయిక‌గా నివేద‌కు గ్రాఫ్ అమాంతం పెరిగింద‌నే భావించ‌వ‌చ్చు.

జెంటిల్‌ మేన్ - నిన్ను కోరి త‌ర్వాత 118 త‌న కెరీర్ గ్రాఫ్ ని పెంచుతుంద‌ని నివేద తెలిపింది. త‌దుప‌రి సినిమాల గురించి చెబుతూ.. `బ్రోచేవారెవరురా` విడుదలకి సిద్ధమవుతోంది. ఇందులో బాగా న‌వ్విస్తాను.. ఇప్ప‌టివ‌ర‌కూ చేయ‌ని పాత్ర ఇది. నేను కామెడీ చేస్తాను అన్న‌దే ఊహించ‌లేను. ఎలా పండిందో తెర‌పైనే చూడాలి.. అని అంది. శ్వాస సినిమాలో నటిస్తున్నాను. మార్చిలో సెట్స్ కెళుతుంది ఆ చిత్రం. తెలుగు- తమిళం-మలయాళం భాషల్లో నటించే ప్ర‌ణాళిక‌లు ఉన్నాయి... అని తెలిపింది. తెలుగు-త‌మిళం- మ‌ల‌యాళం- ఇంగ్లీష్ భాషల్ని ఎంతో సౌక‌ర్యంగా మాట్లాడేస్తోంది ఈ భామ‌. క‌న్న‌డం మాత్రం మాట్లాడ‌లేన‌ని తెలిపింది.