Begin typing your search above and press return to search.
ఆ ఎనర్జీ ఎవరిలోనూ చూడలేదు
By: Tupaki Desk | 11 Sept 2017 1:22 PM ISTజూనియర్ ఎన్టీఆర్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం జై లవకుశ. ఈ నెల 21 న రిలీజ్ కాబోతున్న ఈ చిత్రం ట్రైలర్ లాంచ్ వేడుకని చిత్ర నిర్మాత కళ్యాణ్ రామ్ బారి స్థాయిలో నిర్వహించారు. వేడుకలో మాట్లాడిన చిత్ర యూనిట్ మరియు ఇతర ముఖ్య అతిధులు ప్రతి ఒక్కరు ఎవరి స్థాయిలో వారు మాట్లాడి అభిమానులను ఆకర్షించారు.
అయితే ఈ చిత్రంలో నటిస్తున్న నివేద థామస్ మాత్రం తన స్టైల్ లో ఇచ్చిన స్పీచ్ ఎన్టీఆర్ అభిమానులకు తెగ నచ్చేసింది. ఆమె మాట్లాడుతూ.. చిత్ర యూనిట్ సభ్యులందరు నాకు ఎంతో హెల్ప్ చేశారు. ముఖ్యంగా చోటా కె నాయుడు గారు దర్శకుడు బాబీ తనను ఎంతో గైడ్ చేసి మంచి నటిగా నన్ను తీర్చిదిద్దారని చెబుతూ.. ఎన్టీఆర్ గురించి ఎవరూ చెప్పలేని విధంగా చెప్పి నందమూరి అభిమానుల మనసుని గెలుచుకుంది. ఎన్టీఆర్ లాంటి హీరోను ఇంతవరకు నేను చూడలేదు. అతని ఎనర్జీ లెవల్ అసమనం అని, ఇక ఎన్టీఆర్ హార్డ్ వర్క్ చూస్తే ఎవ్వరికైనా సినిమా కోసం ఇంకా కష్టపడాలి అనిపిస్తోందని చెప్పింది. ఎన్టీఆర్ బిగ్ బాస్ షో చేస్తూనే మరో వైపు షూటింగ్ ని కూడా అనుకున్న టైమ్ కి పూర్తి చేశాడని చెబుతూ.. ఆయన రోజుకి పది సార్లు కాస్ట్యూమ్స్ చేంజ్ చేశారు. అలాగే ఏ మాత్రం మూవీ మూడ్ చెడగొట్టకుండా మూడు విభిన్నమైన పాత్రలను చక్కగా చేశాడని ఈ మలయాళీ బ్యూటీ పొగిడేసింది.
అలాగే తారక్ నుంచి తాను ఎన్నో నేర్చుకున్నాను అంటూ తారక్ కెరీర్ లో ఈ సినిమా బెస్ట్ సినిమా అవుతుందని నివేద ఆశాభావం వ్యక్తం చేసింది. ఇక అమ్మడి అందాన్ని చూసి అభిమానులు ఐ లవ్ యు అని అరవడంతో ఆమె ఏ మాత్రం తప్పుగా అనుకోకుండా వారి ప్రేమకు ప్రేమతో ఐ లవ్ యు టూ అని చెప్పి అందరిని ఆకర్షించింది.