Begin typing your search above and press return to search.

కళ్యాణ్ రామ్ తో.. నో రొమాన్స్

By:  Tupaki Desk   |   26 April 2018 9:58 AM GMT
కళ్యాణ్ రామ్ తో.. నో రొమాన్స్
X
మలయాళీ కుట్టి నివేదా థామస్ వరుసగా సినిమాలు చేసేస్తూ.. మధ్యలో టక్కుమని బ్రేక్ ఇచ్చేసింది. జెంటిల్ మ్యాన్.. నిన్ను కోరి.. జైలవకుశ వంటి హిట్ మూవీస్ ను ఖాతాలో వేసుకున్న ఈ బ్యూటీ.. స్టడీస్ కోసం మధ్యలో బ్రేక్ తీసేసుకుంది. ఇప్పుడు మళ్లీ యాక్టింగ్ కెరీర్ పై దృష్టి పెట్టిన ఈ భామ.. కొత్త సినిమాను ఒప్పేసుకుంది.

గతంలో జూనియర్ ఎన్టీఆర్ తో నటించిన నివేదా థామస్.. ఇప్పుడు అతని సోదరుడు నందమూరి కళ్యాణ్ రామ్ తో మూవీకి సై అనేసింది. కేవీ గుహన్ దర్శకత్వంలో రూపొందనున్న థ్రిల్లర్ కు యాక్సెప్ట్ చేసింద నివేద.. ఈ సినిమాలో తన క్యారెక్టర్ సూపర్బ్ గా ఉంటుందని చెబుతోంది. అయితే.. ఈ చిత్రంలో నివేద చేస్తున్న పాత్ర.. స్ట్రెయిట్ గా హీరోయిన్ కాదు. అంటే హీరోతో రొమాంటిక్ ట్రాక్ లాంటివి ఏమీ ఉండవు. కానీ మూవీలో ఈమెది చాలా ఇంపార్టెంట్ రోల్ అన్న మాట. హీరోకి ప్రేయసి రోల్ ను అర్జున్ రెడ్డి భామ షాలినీ పాండే చేస్తుండగా.. మూవీని నడిపించే పాత్ర కోసం నివేదా థామస్ ను ఎంచుకున్నారట.

హీరో పాత్ర.. నివేద రోల్ కలిసిన తర్వాత మూవీ ఆసక్తికరంగా మారుతుందని.. గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో రూపొందిన ఈ సబ్జెక్టులో.. అత్యంత ప్రధానమైన పాత్ర ఆమెదేనని తెలుస్తోంది. పెర్ఫామెన్స్ ఓరియెంటెడ్ రోల్ కావడంతోనే నివేదా థామస్ ను ఎంచుకున్నారట. సబ్జెక్టులను ఎంచుకోవడంలో నివేద ట్యాలెంట్ ఇప్పటికే ప్రూవ్ అయింది కాబట్టి.. నందమూరి హీరోతో రొమాన్స్ చేయకుండానే.. లీడ్ రీల్ చేయగలుగుతోంది మరి.