Begin typing your search above and press return to search.
అమ్మడు ప్రభాస్ పక్కన నటించే ఛాన్స్ కొట్టేసిందా...?
By: Tupaki Desk | 18 Aug 2020 4:00 PM GMTయంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ 'మహానటి' ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్న విషయం తెలిసిందే. ప్రభాస్ కెరీర్లో 21వ చిత్రంగా రానున్న ఈ మూవీని వైజయంతీ మూవీస్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో అశ్వినీ దత్ నిర్మించనున్నారు. పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ గా రూపొందనున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ దీపికా పడుకుణేని హీరోయిన్ గా ఫైనలైజ్ చేసినట్లు ఇటీవల మేకర్స్ ప్రకటించారు. దీపికా రాకతో ఈ సినిమాపై అంచనాలు తారా స్థాయికి చేరుకున్నాయి. అయితే ఈ సినిమాలో మరో హీరోయిన్ కి కూడా స్కోప్ ఉందని.. ఇందుకోసం నాగ్ అశ్విన్ ఇప్పటికే వేట ప్రారంభించారని వార్తలు వస్తున్నాయి.
కాగా ఈ ప్రాజెక్ట్ లో సెకండ్ హీరోయిన్ గా నివేద థామస్ ని తీసుకోవాలని మేకర్స్ ఆలోచిస్తున్నారట. నాని 'జెంటిల్ మెన్' సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన నివేద 'నిన్ను కోరి' 'జై లవకుశ' 'బ్రోచేవారెవరురా' సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ 'వకీల్ సాబ్'లో నివేద కీలక పాత్రలో కనిపించనుంది. ఇక ఈ బ్యూటీ నాని - సుధీర్ బాబు కాంబినేషన్ లో తెరకెక్కిన 'వి' సినిమాలోనూ నటించింది. ఇప్పుడు ప్రభాస్ మూవీ ఆఫర్ కొట్టేసిందనే వార్తలు నిజమో కాదో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే. ఈ సినిమాని పరిస్థితులు అనుకూలిస్తే వీలైనంత త్వరగా సెట్స్ పైకి తీసుకెళ్లి 2022 సమ్మర్ కానుకగా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని సమాచారం.