Begin typing your search above and press return to search.
తొక్కేస్తున్నారు అంటున్న హీరో
By: Tupaki Desk | 19 Feb 2016 9:30 AM GMT మలయాళ చిత్ర సీమలో రాజకీయాలు బాగా ఎక్కువ. అక్కడ సీనియర్ హీరోల ఆధిపత్యం ఇంకా కొనసాగుతోంది. దీంతో కొత్త హీరోలు నిలదొక్కుకోవాలంటే నానా పాట్లు పడాలి. ఈ కారణంగానే చాలామందికి టాలెంటు ఉన్నా కొద్ది రోజుల్లోనే తెరమరుగు అయిపోయారు. ఇప్పుడు యంగ్ హీరో నివిన్ పాలీ కూడా తనను తొక్కేస్తున్నారంటూ ఆక్రోశిస్తున్నాడు. మలయాళ చిత్ర సీమలో ఒక్కసారిగా తారాపథంలోకి దూసుకెళ్లిన పాలీ ఇప్పుడు మనుగడ కోసం పోరాడాల్సి వస్తోందట. నేరమ్ - బెంగళూర్ డేస్ లాంటి చిత్రాలతో నిలదొక్కుకున్న నివిన్ పాలీ 'ప్రేమమ్'తో ఇండస్ట్రీ హిట్ కొట్టాడు. ఆ దెబ్బతో సూపర్ స్టార్ అయిపోయాడు. అయితే తన తాజా చిత్రం 'యాక్షన్ హీరో బిజు' విడుదలకి ముందు నుంచే నెగెటివ్ ప్రచారం జరిగిందని, సినిమా విడుదలైన తర్వాత ఒక గ్యాంగ్ కావాలని దానిపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేసిందని, తనను ఎలాగైనా తొక్కేయాలని చూస్తున్నారని ఆయన అంటున్నాడు.
అయితే... తన సినిమా గురించి ఎంతగా బ్యాడ్ టాక్ తీసుకురావాలని ట్రై చేసినా కూడా నిజమైన సినీ ప్రేమికులు తన సినిమాని ఆదరించారని, నెమ్మదిగా ఇప్పుడు సినిమా నిలదొక్కుకుందని, మంచి టాక్ తో రన్ అవుతోందని చెప్పాడు. ప్రేమమ్ సినిమా సమయంలోనూ పాలీని ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు జరిగాయి. దాని డివిడి ప్రింట్ ని ఇంటర్నెట్ లో అప్ లోడ్ చేసారు. తమ సినిమాని కాపాడుకోవడానికి పాపం ఆ దర్శకుడు, నిర్మాత, హీరో చాలా కష్టపడాల్సి వచ్చింది. ఇదంతా కావాలనే జరుగుతోందని నివిన్ ఇప్పుడు బహిరంగంగా ఆరోపిస్తున్నాడు కాబట్టి ఈ తొక్కేసే బ్యాచ్ ఎలా రెస్పాండ్ అవుతుందో చూడాలి.