Begin typing your search above and press return to search.
నైజాం డిస్ట్రిబ్యూటర్ కి బిగ్ బ్లో
By: Tupaki Desk | 14 May 2022 12:30 AM GMTనైజామ్ ఏరియాలో డిస్ట్రిబ్యూటర్ల మధ్య గత కొంత కాలంగా ఆధిపత్య పోరు నడుస్తోంది. ఒకరిని మించి ఒకరు ముందుకెళ్లాలని, ఒకరిని ఒకరు డామినేట్ చేసుకోవాలనే పంతం మొదలైంది. ఈ పంతం ఎక్కడిదాకా వెళ్లిందంటే తమని తాము పీకల్లోతు నష్టాల్లోకి నెట్టుకునేంత. ఎదుటి వారిని డామినేట్ చేయాలనే ఆలోచనతో ఫ్యాన్సీ రేట్లకు సినిమాలని కొనేయడం, కోట్లకు కోట్లు కుమ్మరించడం.. అవి దారుణ ఫ్లాపులుగా మారితే దిక్కలు చూడటం ఇప్పడు నైజాంలో నయ ట్రెండ్ గా మారింది.
వివరాల్లోకి వెళితే.. నైజాంలో డిస్ట్రిబ్యూషన్ అంటే గత 20 ఏళ్లుగా స్టార్ ప్రొడ్యూసర్ క్యాంపస్ పేరే వినిపించేది. భారీ చిత్రాలని నైజాంలో రిలీజ్ చేయాలంటే ఆయన పేరే ప్రధానంగా వినిపించేది. తన ఎంత కోట్ చేస్తే అంతే అనే స్థాయిలో నైజాం ఏరియాలో స్టార్స్ సినిమాల డిస్ట్రిబ్యూషన్ బిజినెస్ సాగింది. కానీ ఒక్కసారిగా యంగ్ డిస్ట్రిబ్యూటర్ ఎంటర్ కావడంతో లెక్కలన్నీ మారిపోయాయి. వరంగల్ కు చెందిన డిస్ట్రిబ్యూటర్ గత కొంత కాలంగా నైజాం ఏరియా డిస్ట్రిబ్యూషన్ రంగంలో హల్ చల్ చేస్తున్నాడు.
రెగ్యులర్ గా సినిమాలు నిర్మిస్తూ డిస్ట్రిబ్యూటర్ గానూ కొనసాగుతున్న స్టార్ ప్రొడ్యూసర్ కు గట్టి పోటీనిస్తూ వరంగల్ వాసి ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాడు. అయితే అతని దూకుడుకు తాజాగా కళ్లెం పడింది. స్టార్ హీరోలు నటించిన చిత్రాలకు భారీ మొత్తాన్ని కోట్ చేస్తూ స్టార్ ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్ కు నైజాం ఏరియాలో కొరకరాని కొయ్యాగా మారిన వరంగల్ వాసికి తాజాగా గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఆయన దూకుడుకు స్పీడ్ బ్రేకర్ గా మారి షాకిచ్చింది.
దాదాపు రెండున్నరేళ్ల విరామం తరువాత స్టార్ హీరో తన తనుడితో కలిసి ఓ భారీ చిత్రంలో నటించారు. అపజయమెరుగని స్టార్ డైరెక్టర్ ఈ చిత్రాన్ని అత్యంత భారీ స్థాయిలో తెరపైకి తీసుకొచ్చారు. ఇద్దరు స్టార్ లు నటించిన సినిమా కావడంతో ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టడం ఖాయం అని అభిమానులు, సదరు యంగ్ డిస్ట్రిబ్యూటర్ ధీమాతో 43 కోట్లు వెచ్చించి నైజామ్ థియేట్రికల్ రైట్స్ ని సొంతం చేసుకున్నాడు.
ఇది ఇండస్ట్రీ వర్గాలతో పాటు డిస్ట్రిబ్యూషన్ వింగ్ లోనూ సంచలనం సృష్టించింది. ఎంత తండ్రీ కొడుకులు నటించిన సినిమా అయితే 43 కోట్లు పెట్టాలా?.. ఇది రికవరీ కావడం అసాధ్యమే అని తోటి డిస్ట్రిబ్యూటర్లు ముందే పెదవి విరిచారు.
అయినా స్టార్ ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్ కు పోటీగా వెళ్లాల్సిందే అంటూ వరంగల్ వాసి అగ్రెసీవ్ గా ముందుకు వెళ్లాడు. ఫలితం బాక్సాఫీస్ వద్ద సదరు స్టార్ హీరోలు నటించిన సినిమా భారీ డిజాస్టర్ గా మారింది. భారీ అంచనాలు పెట్టుకున్న సదరు డిస్ట్రిబ్యూటర్ కు బిగ్ బ్లో ఎదురైంది. సినిమా ఫ్లాప్ గా మారడంతో తను పెట్టిన పెట్టుబడిలో 50 శాతం కోల్పోయాడట. దీంతో అతన్ని నమ్మ కోట్లు కుమ్మరించిన ఎగ్జిబిటర్లు ఇప్పుడు రికవరీ కావాలని అడుగుతున్నారట . ప్రస్తుతం ఇది ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మరి 50 శాతం కోల్పోయిన వరంగల్ వ్యక్తి తిరిగి ఎగ్జిబిటర్ల నష్టాలను చెల్లిస్తాడా? .. ఏం జరగబోతోందన్నది తీవ్ర ఉత్కంఠగా మారింది.