Begin typing your search above and press return to search.
నైజాంకు వాళ్లిద్దరే ఇంపార్టెంట్
By: Tupaki Desk | 20 Sep 2017 5:43 AM GMTతెలుగు సినిమాలకు నైజాం ఎంత కీలకమో చెప్పాల్సిన పనే లేదు. ఇక్కడ రిలీజ్ హక్కుల కోసం పలికే మొత్తాన్ని బట్టి సినిమా బడ్జెట్ ను నిర్మాతలు ప్లాన్ చేసుకుంటుంటారు. ఇంతకుముందు నాన్ రిఫండబుల్ అడ్వాన్స్ పద్ధతిలో డిస్ట్రిబ్యూటర్లు సినిమా హక్కులు సొంతం చేసుకునేవారు. ఈ పద్ధతిలో హక్కులు తీసుకుంటే సినిమా ఫ్లాపయినా నిర్మాత నుంచి ఎలాంటి సహాయం అందదు. సక్సెస్ పర్సంటేజీ తక్కువగా ఉండే ఇండస్ట్రీ కావడంతో కాలక్రమంలో చాలామంది డిస్ట్రిబ్యూటర్లు ఈ రంగం వదిలేసి బయటకు వెళ్లిపోయారు.
ప్రస్తుతం సినిమా చిన్నదైనా.. పెద్దదైనా నైజాం ఏరియాలో రిలీజ్ చేయాలంటే ఆల్ మోస్ట్ ఇద్దరే డిస్ట్రిబ్యూటర్లు మాత్రమే ఉన్నారు. వారిలో ఒకరు దిల్ రాజు.. మరొకరు ఏషియన్ సినిమాస్ సునీల్. వీళ్లు పాత పద్ధతుల్లోలాగా నాన్ రిఫండబుల్ అడ్వాన్స్ లకు హక్కులు తీసుకోరు. నిర్మాతకు ఎక్కువ రిస్కు ఉండే అడ్వాన్స్ పద్ధతిలోనే హక్కులు కొనుగోలు చేస్తారు. వీళ్లు చెప్పిన రేటు నిర్మాతకు నచ్చని పక్షంలో సొంతంగా విడుదల చేసుకోవాల్సిందే. అదే టైంలో వీళ్లిద్దరి డిస్ట్రిబ్యూషన్ లో భారీ చిత్రం విడుదలైతే సొంతంగా రిలీజ్ చేసుకునేవారికి థియేటర్లు దొరకవు. దాంతో సినిమా బాగున్నా నిర్మాత జేబులోకి డబ్బులొచ్చే పరిస్థితులు ఉండవు.
వీళ్లిద్దరిలో దిల్ రాజు టాలీవుడ్ లో టాప్ ప్రొడ్యూసర్ కూడా. ఈ ఏడాదిలో ఇద్దరు మెగా హీరోలతో సినిమాలు నిర్మించారు. భారీ బడ్జెట్ చిత్రాలతో పాటు మీడియం రేంజి సినిమాలు కూడా తీస్తుంటారు. నైజాంతో పాటు ఉత్తరాంధ్రలో పలు థియేటర్లు ఆయన చేతిలోనే ఉన్నాయి. దీంతో దిల్ రాజు ప్రస్తుతం ఇండస్ట్రీలో చాలా ఇంపార్టెంట్ పర్సన్ అయిపోయాడు.