Begin typing your search above and press return to search.
రోబోకి పని చేసి ఇలా చేశాడేంటి?
By: Tupaki Desk | 4 Jun 2019 1:30 AM GMTక్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ లో 6 ప్రేమకథలతో తెరకెక్కిన సినిమా `7`. హవీష్ ఈ చిత్రంలో కథానాయకుడు. ఆరుగురు భామలు కథానాయికలుగా ఆడిపాడారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ నిజార్ షఫీ దర్శకత్వం వహించారు. జూన్ 5 న సినిమా రిలీజవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్ లో నిజార్ పాత్రికేయులతో ముచ్చటిస్తూ పలు ఆసక్తికర సంగతుల్ని తెలిపారు. భలే భలే మగాడివోయ్- నేను లోకల్- మహానుభావుడు- శైలజారెడ్డి అల్లుడు చిత్రాలకు నిజార్ ఛాయాగ్రాహకుడిగా పనిచేశారు. ఆ క్రమంలోనే హవీష్ -రమేష్ వర్మ బృందంతో ఉన్న పరిచయంతో.. వీళ్లంతా కలిసి ఒక స్టోరీ లైన్ ని డెవలప్ చేసి స్క్రిప్టుగా మలిచి అటుపై సెట్స్ కెళ్లారట.
తాజా ఇంటర్వ్యూలో నిజార్ మాట్లాడుతూ ..``రత్నవేలు వద్ద రోబో చిత్రానికి అసోసియేట్ కెమెరామేన్ గా పని చేశాను. ఇండస్ట్రీలో సినిమాటోగ్రాఫర్ గా సుదీర్ఘ అనుభవం ఉంది. అయితే దర్శకుడు అయిపోవాలని అనుకోలేదు. అనుకోకుండా 7 కథ ఇంప్రెస్ చేయడంతో దర్శకుడిగా మారాను. నా స్వస్థలం చెన్నై. ఎంజిఆర్ గవర్నమెంట్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ట్రయినింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో డిప్లొమా ఇన్ సినిమాటోగ్రఫీ చేశాను. లఘుచిత్రాలకు దర్శకత్వం వహించాను. కోర్స్ పూర్తయిన తర్వాత శక్తి శరవణన్ తో సరోజ- తెలుగులో గ్యాంబ్లర్ చిత్రాలకు అసిస్టెంట్ సినిమాటోగ్రాఫర్‌గా పని చేశా. రజనీకాంత్ రోబోకి సినిమాటోగ్రాఫర్ రత్నవేలుగారి దగ్గర అసిస్టెంట్ గా చేశా. తర్వాత తమిళంలో మూడు సినిమాలకు సినిమాటోగ్రఫీ చేశా. అందులో సత్యరాజ్ గారు నిర్మించిన `నాయిగల్ జాకిరతై` ఒకటి. వాళ్లబ్బాయి శిబిరాజ్ హీరోగా నటించారు. ఆ సినిమా కెమెరా వర్క్ మారుతిగారికి నచ్చింది.`భలే భలే మగాడివోయ్`కి వర్క్ చేద్దామని పిలిచారు. తర్వాత నేను లోకల్-మహానుభావుడు-శైలజారెడ్డి అల్లుడు సినిమాలు చేవాను. `7`తో దర్శకుడిగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాను. హీరో హవీష్ తో చాలాకాలంగా పరిచయం ఉంది. ఆయన ఫోన్ చేసి లైన్ ఉందని చెప్పారు. అటుపై సినిమా మొదలైంది`` అని తెలిపారు.
లిప్ కిస్సుల ఐడియా నాదే. కథలో భాగంగా ఉంటాయి. ప్రేమకథలో లిప్ కిస్సులు కూడా భాగమే. నటుడిగా ముద్దు సన్నివేశాలు చేయడానికి హవీష్ కొంచెం అలోచించి ఉండొచ్చు. కానీ దర్శకుడిగా సెట్ లో నాకు కావలసిన సన్నివేశాలు చేయించుకున్నాను. రొమాన్స్ థ్రిల్ సీన్స్ మైమరిపిస్తాయి. లిప్ లాక్ లు నేనే డిజైన్ చేశాను.. అని తెలిపారు. ``ఆరుగురు నాయికలు ఆరు కథల్లో కనిపిస్తారు. ఒక సినిమాటోగ్రాఫర్ అనుకున్నది అనుకున్నట్టుగా 95 శాతం వరకూ తీయవచ్చు. సినిమాటోగ్రఫీ మాత్రమే చేసిన సినిమాలకు కూడా దర్శకులతో షాట్స్ గురించి చర్చించి ప్లాన్ చేసేవాళ్లం. అది దర్శకుడిగా నాకు ఉపయోగ పడింది. శైలజారెడ్డి అల్లుడు-సెవెన్ షెడ్యూల్స్ క్లాష్ అవ్వడంతో పగలు రాత్రి శ్రమించాల్సి వచ్చింది. పగలు శైలజారెడ్డి అల్లుడు.. రాత్రి పూట సెవెన్ షూటింగ్ చేసేవాడిని.. అందుకోసం రాత్రులు నిద్రపోలేద``ని నిజార్ తెలిపారు.
తాజా ఇంటర్వ్యూలో నిజార్ మాట్లాడుతూ ..``రత్నవేలు వద్ద రోబో చిత్రానికి అసోసియేట్ కెమెరామేన్ గా పని చేశాను. ఇండస్ట్రీలో సినిమాటోగ్రాఫర్ గా సుదీర్ఘ అనుభవం ఉంది. అయితే దర్శకుడు అయిపోవాలని అనుకోలేదు. అనుకోకుండా 7 కథ ఇంప్రెస్ చేయడంతో దర్శకుడిగా మారాను. నా స్వస్థలం చెన్నై. ఎంజిఆర్ గవర్నమెంట్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ట్రయినింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో డిప్లొమా ఇన్ సినిమాటోగ్రఫీ చేశాను. లఘుచిత్రాలకు దర్శకత్వం వహించాను. కోర్స్ పూర్తయిన తర్వాత శక్తి శరవణన్ తో సరోజ- తెలుగులో గ్యాంబ్లర్ చిత్రాలకు అసిస్టెంట్ సినిమాటోగ్రాఫర్‌గా పని చేశా. రజనీకాంత్ రోబోకి సినిమాటోగ్రాఫర్ రత్నవేలుగారి దగ్గర అసిస్టెంట్ గా చేశా. తర్వాత తమిళంలో మూడు సినిమాలకు సినిమాటోగ్రఫీ చేశా. అందులో సత్యరాజ్ గారు నిర్మించిన `నాయిగల్ జాకిరతై` ఒకటి. వాళ్లబ్బాయి శిబిరాజ్ హీరోగా నటించారు. ఆ సినిమా కెమెరా వర్క్ మారుతిగారికి నచ్చింది.`భలే భలే మగాడివోయ్`కి వర్క్ చేద్దామని పిలిచారు. తర్వాత నేను లోకల్-మహానుభావుడు-శైలజారెడ్డి అల్లుడు సినిమాలు చేవాను. `7`తో దర్శకుడిగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాను. హీరో హవీష్ తో చాలాకాలంగా పరిచయం ఉంది. ఆయన ఫోన్ చేసి లైన్ ఉందని చెప్పారు. అటుపై సినిమా మొదలైంది`` అని తెలిపారు.
సెవన్ ఒక రొమాంటిక్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్. రెహమాన్ ఇందులో పోలీస్ అధికారిగా కనిపిస్తారు. ఆయన దగ్గరకు ఒక కేసు వస్తుంది. కేసుకు సంబంధించి మొత్తం ఏడుగురు వ్యక్తులు కీలకంగా ఉంటారు. హీరో కార్తీక్.. ఆరుగురు హీరోయిన్లు.. రెహమాన్ దృష్టిలో ఏడుగురు. క్రైమ్ థ్రిల్లర్ రక్తి కట్టిస్తుంది. కొన్ని గంటల్లో తెరపై మీరే చూడబోతున్నారు. ఇందులో కార్తీక్ పాత్రలో హవీష్ చాలా కొత్తగా కనిపిస్తాడు.. అని తెలిపారు. ఈ సినిమాలో లిప్ లాక్ లు లెక్కకు మిక్కిలిగా ఉన్నాయి. మీరే ప్లాన్ చేశారట కదా? అని ప్రశ్నిస్తే..