Begin typing your search above and press return to search.
చిన్నమ్మ అంటే.. వద్దమ్మా అంటున్నారట!
By: Tupaki Desk | 28 Sep 2018 8:57 AM GMTతమిళ నాడు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ జయలలిత బయోపిక్ తెరకెక్కించేందుకు పలువురు ఫిలిం మేకర్స్ రంగం సిద్దం చేసుకుంటున్న విషయం తెలిసిందే. అందరిలో మొదటగా జె. ప్రియదర్శిని 'ది ఐరన్ లేడీ' టైటిల్ తో ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేసింది. ఈ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. అధికారికంగా ఇంకా ప్రకటించకపోయినా 'అమ్మ' పాత్రను గా నిత్య మీనన్ పోషిస్తుందనే టాక్ ఉంది.
ఈ సినిమా ప్రీప్రొడక్షన్ లో బిజీగా ఉన్న ప్రియదర్శిని కి ఒక పాత్ర విషయంలో మాత్రం ఇబ్బందులు ఎదురవుతున్నాయట. ఆ పాత్ర ఎవరిదో కాదు 'చిన్నమ్మ' గా పేరుతెచ్చుకున్న జయ నెచ్చెలి శశికళ దే. ఇప్పటికే ఈ పాత్ర కోసం ప్రియదర్శిని శరత్ కుమార్ కూతురు వరలక్ష్మి ని.. ఐశ్వర్య రాజేష్ ను సంప్రదించిందట. కానీ వాళ్ళు చిన్నమ్మ రోల్ లో నటించేందుకు పెద్దగా ఇంట్రెస్ట్ చూపడం లేదట. అక్రమాస్తుల కేసులో శశికళ పరప్పన అగ్రహార జైలులో శిక్షను అనుభవిస్తున్న విషయం తెలిసిందే. ఆమె పాత్రను నెగెటివ్ గా చూపించిన పక్షంలో ఆమె వర్గం వారు..ఆమె అభిమానులు ఊరుకోరని.. వారితో లేనిపోని ఇబ్బందులు తప్పవని భయపడుతున్నారట.
ప్రియదర్శిని వారిద్దరిలో ఒకరిని ఒప్పిస్తుందా లేదా అనేది వేచి చూడాలి. ఒకవేళ వారు ఒప్పుకోకపొతే మరో నటి కోసం ప్రయత్నించక తప్పదు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ను వచ్చే ఏడాది ఫిబ్రవరి 24 న జయలలిత జయంతి సందర్భంగా ప్రారంభించాలని అనుకుంటున్నారట.