Begin typing your search above and press return to search.
టాలీవుడ్ పెద్దలకి సీఎం అపాయింట్ మెంట్ ఇవ్వలేదా?
By: Tupaki Desk | 30 July 2021 2:30 AM GMTనిత్యం షూటింగులతో బిజీ బిజీగా ఉన్న మెగాస్టార్ చిరంజీవిని కలవడం అంటే ఆషామాషీ కాదు. బాస్ కి అత్యంత సన్నిహిత వర్గం ద్వారానే అది వీలవుతుంది. మిస్ కమ్యునికేషన్ ఉన్నా...చిరంజీవి బిజీగా ఉన్నా కలవడం ఆసాధ్యం. అయితే ఆయన ప్రీగా ఉంటే మాత్రం ఎవరితో అయినా నేరుగా ఇంటికే పిలిపించి మాట్లాడుతారు. కావాల్సినంత సమయాన్ని ఇస్తారు. అందుకు ఇటీవల చిన్న సినిమా ప్రమోషన్లు పెద్ద సాక్ష్యం. గతం కంటే ఇటీవలి కాలంలో చిరంజీవి చిన్న సినిమాల్ని ఎంతగా ఎంకరేజ్ చేస్తున్నారో తెలిసిందే. సినిమా కంటెంట్ తో సంబంధం లేకుండా చిరంజీవి చిన్న సినిమాలకు ప్రమోషన్లు చేసి పెడుతున్నారు.
కరోనా రాక ముందు వరకూ చిరంజీవి ఇంట్లో ఎన్నో సినిమా ప్రెస్ మీట్లు జరిగాయి. ఇక బిగ్ స్టార్లు ఎవరైనా ఆహ్వానిస్తే ఆయన ఆ వేడుకకు తప్పక హాజరవుతారు. అయితే ఇటీవలి కాలంలో చిరంజీవి బాగా బిజీ అయిన మాట వాస్తవం. `ఆచార్య` సినిమా షూటింగ్...కొత్త ప్రాజెక్ట్ ల కమిట్ మెంట్లు సహా వ్యక్తిగత పనులతో బిజీగా ఉంటున్నారు. ఈ కారణంగా మెగాస్టార్ అపాయింట్ మెంట్ ఇవ్వడం లేదట. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఇదే పరిస్థితిలో సినీపెద్దలకు అపాయింట్ మెంట్ ఇవ్వడం లేదన్న ప్రచారం సాగుతోంది.
ముఖ్యమంత్రి జగన్ ని టాలీవుడ్ పెద్దలు అపాయింట్ మెంట్ అడిగితే ఇవ్వలేదనే టాక్ బయటకు వచ్చింది. అయితే అందుకు కారణంగా ఆయన బిజీ షెడ్యూల్ అని సమాచారం. ప్రజాపాలన.. సంక్షేమ పథకాలు సహా మూడు రాజధానుల అంశంపై నిత్యం వేర్వేరు మీటింగ్ లతో బిజీగా ఉండటం వల్లే సినీపెద్దల్ని కలవలేకపోతున్నారని అంటున్నారు. త్వరలోనే సినీ పెద్దల కోరిక మేరకు ముఖ్యమంత్రి తన కార్యాలయానికి పిలిపించి వాళ్లతో మాట్లాడే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.