Begin typing your search above and press return to search.
C/o కంచరపాలెం: అవార్డులు లేవు
By: Tupaki Desk | 10 Jan 2019 5:50 AM GMTటాలీవుడ్ లో 2018 లో ఎన్నో మంచి సినిమాలు వచ్చాయి. కొత్త తరం ఫిలిం మేకర్స్ డిఫరెంట్ కంటెంట్ తో సినిమాలను తెరకెక్కించి ప్రేక్షకులచేత ప్రశంసలు అందుకున్నారు. అలాంటి సినిమాలలో 'C/o కంచరపాలెం' ఒకటి. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా అవార్డులు వస్తాయనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.. కానీ ఈ సినిమాకు నేషనల్ అవార్డు ఒక్కటి కూడా వచ్చే అవకాశం లేదట.
ఈ సినిమాను అసలు అవార్డులకు పంపడానికి కూడా అర్హత లేదట. కారణం ఏంటంటే నేషనల్ అవార్డులకు నామినేషన్లు పంపేందుకు ఆ సినిమా నిర్మాత ఇండియన్ అయి ఉండాలన్నది రూల్. ఈ సినిమా నిర్మాత పరుచూరి ప్రవీణ అమెరికన్ సిటిజెన్ కావడంతో ఈ సినిమాను నేషనల్ అవార్డులకు పంపేందుకు అవకాశం లేకుండా పోయింది. ప్రవీణ గారు అమెరికా పౌరురాలే అయినప్పటికీ భారత మూలాలు కల వ్యక్తి. పైగా ఆమె సినిమా నిర్మించింది తెలుగు ప్రేక్షకుల కోసం కాబట్టి ఈ సినిమాను నామినేట్ చేసేందుకు మినహాయింపు ఇవ్వాలని కొందరు నెటిజనులు కోరుతున్నారు.
ఆస్కార్ అవార్డుల నామినేషన్స్ లో కూడా అమెరికన్ కంపెనీలు నిర్మించిన సినిమాలకు మాత్రమే అర్హత ఉంటుంది. ఒక్క ఉత్తమ విదేశీ చిత్రం కేటగిరీ తప్ప మిగతా అవార్డుల కేటగిరీలకు అదే సూత్రం వర్తిస్తుంది. ఈ లెక్కన 'కేరాఫ్ కంచరపాలెం' సినిమాను.. వీలైతే.. కుదిరితే ఆస్కార్ అవార్డులకు పంపితే బాగుటుందేమో!