Begin typing your search above and press return to search.
శుక్రవారం ఇంత చప్పగా ఉందే
By: Tupaki Desk | 22 Aug 2019 5:44 AM GMTప్రతి వారం కనీసం రెండు లేదా మూడు చెప్పుకోదగ్గ క్రేజీ సినిమాలతో సందడిగా ఉండే టాలీవుడ్ రేపు చాలా డల్ గా కనిపిస్తోంది. సాహో ఇంకో వారం రోజుల వ్యవధిలో వస్తుండటంతో మిగిలిన నిర్మాతలకు ధైర్యం చాలడం లేదు. ఎలాగూ ఆ రోజు నుంచి స్క్రీన్లన్నీ సాహోతోనే నిండిపోతాయి. అలాంటప్పుడు రిస్క్ చేసి కేవలం ఏడు రోజుల రన్ కోసం ఎందుకు రిలీజ్ చేయాలన్న ఆలోచనతో ఎవరూ 23 తేదీ జోలికి వెళ్లే సాహసం చేయడం లేదు. అయినా కూడా ధైర్యం చేసి ఓ పది దాకా తెలుగు సినిమాలు రేపు వస్తున్నాయంటే నమ్మగలమా.
కానీ ఇది నిజం. ఉన్నవాటిలో రెగ్యులర్ గా మూవీస్ చూసే అలవాటున్న వాళ్లకు కంటికి కనిపిస్తున్నవి రెండే. ఒకటి కౌసల్య కృష్ణమూర్తి. రెండు ఏదైనా జరగొచ్చు. ఇవి కూడా మరీ ఫస్ట్ షో హౌస్ ఫుల్ అయ్యేంత బజ్ తో ఏమి లేవు. బిసి సెంటర్స్ లో కనీసం వీటి గురించి అవగాహన ఉన్నా గొప్పే అనుకోవచ్చు కౌసల్య కృష్ణమూర్తి ఈవెంట్ కు విజయ్ దేవరకొండ గెస్ట్ గా రావడంతో కొంత ఫోకస్ ఉంది.ఇక బాలన్స్ ఉన్న సినిమాల పేర్లు చెప్పినా గుర్తుపెట్టుకోవడం కష్టమన్నంత వీక్ గా పబ్లిసిటీ చేసుకున్నాయి.
ఈ నేపథ్యంలో రేపు టికెట్ కౌంటర్లు కళకళలాడటం కష్టమే. దీంతో అడవి శేష్ ఎవరుకి మరో ఛాన్స్ దొరికినట్టే. పోటీ పెద్దగా లేకపోయినా రణరంగం దాన్ని ఉపయోగించుకోవడంలో ఫెయిల్ అయ్యింది. ఇక ఎప్పుడో మూడు వారాల క్రితం వచ్చిన రాక్షసుడునే కొన్ని చోట్ల స్టడీగా ఉందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఈ స్తబ్దత ఇంకో వారం రోజులు కొనసాగనుంది. సాహో కోసం థియేటర్లు ఎదురు చూస్తున్నాయి. అప్పటిదాకా ఏవి వచ్చినా ఫీడింగ్ కోసమే అన్న రీతిలో ఉంది వ్యవహారం. పైన చెప్పిన రెండు కాకుండా బాయ్ - కేడి నెంబర్ వన్ - నివాసి - హవా లాంటి చిన్న చిత్రాలు బాగానే క్యూ కట్టాయి.