Begin typing your search above and press return to search.

అక్కడ బాహుబలి-2 అమ్ముడు కాలేదు

By:  Tupaki Desk   |   27 March 2017 9:29 AM GMT
అక్కడ బాహుబలి-2 అమ్ముడు కాలేదు
X
బాహుబలి రేంజ్ ఎంతన్నది ఇప్పుడు అందరికి చాలావరకు క్లారిటీ వచ్చేసింది. బాహుబలి -2 కన్ క్లూజన్ ప్రిరిలీజ్ ఫంక్షన్ సందర్భంగా బాలీవుడ్ ప్రముఖ నిర్మాత.. దర్శకుడు కరణ్ జోహార్ మాట్లాడుతూ.. ఈ చిత్రాన్ని మొఘల్ – ఏ ఆజంతో పోల్చటం తెలిసిందే. బా లీవుడ్ ఎవర్ గ్రీన్ మూవీగా చెప్పుకునే సినిమాతో బాహుబలిని పోల్చటమే కాదు.. ఇలాంటి సినిమా రానున్న రోజుల్లో అంత తేలిగ్గా వచ్చేది లేదన్న విషయాన్ని చెప్పేశాడు. ప్రిరిలీజ్ ఫంక్షన్ కు ముందు వరకూ ఉన్న అంచనాలకు పూర్తి భిన్నమైన హైప్ ను క్రియేట్ చేసిందీ ఫంక్షన్.

మరి ఇలాంటి సినిమా రైట్స్ అమ్మకం పెద్ద విషయమా? అంటే.. ఏ మాత్రం కాదని చెప్పేస్తారు. ఆ రాష్ట్రం.. ఈ రాష్ట్రం అన్న తేడా లేకుండా దేశవ్యాప్తంగా సినీ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్ర హక్కుల్ని సొంతం చేసుకోవటం కోసం పెద్ద పెద్ద సంస్థ లు ముందుకు వస్తున్న పరిస్థితి. ఫ్యాన్సీ ధరలకు అమ్మేసినప్పటికీ.. కర్ణాటక హక్కులు మాత్రం ఇంకా అమ్ముడు కాలేదన్న మాట చాలామందిని ఆశ్చర్యానికి గురి చేస్తుందని చెప్పాలి

ఫస్ట్ పార్ట్ తో రూ.40కోట్ల షేర్ వచ్చిన ఈ మువీ సెకండ్ పార్ట్ ను సొంతం చేసుకోవటానికి డిమాండ్ ఉన్నప్పటికీ.. కొనేందుకు మాత్రం ఎవరూ ముందుకు రాని పరిస్థితి. కర్ణాటకలో టికెట్ ధరల్ని పెంచి అమ్మే విషయంపై అక్కడి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో ఎక్కువ మొత్తానికి కానీ కొంటే.. ఇబ్బంది పడే అవకాశం ఉందన్న భావన అక్కడి సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. భారీ మొత్తం వెచ్చించి హక్కులు సొంతం చేసుకున్నా.. ప్రభుత్వ విధానాల కారణంగా మిగిలేది తక్కువే అవుతుందని.. భారీ పెట్టుబడికి వచ్చే రిటర్న్ తక్కువగా ఉంటే ఎలా? అన్న ప్రశ్న ఎదురవుతుందని చెబుతున్నారు. ఈ కారణంతోనే.. కర్ణాటక హక్కుల విషయం మీద చర్చలు జరుగుతున్నట్లుగా చెబుతున్నారు. మొత్తం హక్కుల్ని హాట్ కేక్ లెక్కన అమ్ముడవుతున్నా.. కర్ణాటకలోని ప్రత్యేకకారణాల వల్ల ఇప్పటికీ డీల్ క్లోజ్ కాలేదని చెబుతున్నారు.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/