Begin typing your search above and press return to search.
పంతం పరిస్థితి బాలేదా?
By: Tupaki Desk | 27 March 2018 6:12 AM GMTప్రతి హీరో ఒకానొక సమయంలో డిజాస్టర్స్ ని వరుసగా ఎదుర్కోక తప్పదు. మొన్నటి వరకు స్టార్ హీరోలుగా ఎదిగిన కొంతమంది యాక్షన్ హీరోలు ఇప్పుడు ఫెయిల్యూర్స్ తో సతమతమవుతున్నారు. అలాంటి వారిలో గోపిచంద్ ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాడని చెప్పవచ్చు. ఎందుకంటే గోపిచంద్ గత కొంత కాలంగా వరుసగా అపజయలను చూస్తున్నాడు. చివరగా వచ్చిన లౌక్యం తప్పితే అతను ఇంతవరకు చేసిన సినిమలేవి పెద్దగా ఆదరణ అందుకోలేదు.
పైగా కొన్ని సినిమలైతే విడుదలకు కూడా నోచుకోక పోవడం బ్యాడ్ లక్. గత ఏడాది సంపత్ నంది దర్శకత్వంలో వచ్చిన గౌతమ్ నంద సినిమా చాలా రిచ్ గా తెరకెక్కినప్పటికి ఉహించని విధంగా డిజాస్టర్ అయ్యింది. అదే తరహాలో ఆక్సిజన్ కూడా ప్లాప్ అయ్యింది. దీంతో గోపిచంద్ సినిమాలకు ఇప్పుడు బయ్యర్స్ కరువయ్యారు. అతను ప్రస్తుతం చేస్తోన్న పంతం సినిమాకు ఎక్కువగా మార్కెట్ లేకపోవడం కలవరపెడుతోంది. ఇటీవల రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ కూడా అంతగా పాపులర్ అవ్వలేదు.
పైగా నెగిటివ్ కామెంట్స్ ఎక్కువగా వచ్చాయి. మంచి యాక్షన్ కథ అయితే గోపిచంద్ కి సెట్ అయినట్టుగా ఎవరికి సెట్ కాదనే చెప్పాలి. అతని బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్టు సినిమాను చేసే దర్శకుడు సెట్ అయితే బాక్స్ ఆఫీస్ లో ఈజీగా స్థానం సంపాదించుకోవచ్చు. ఆ సత్తా గోపిచంద్ లో ఉంది. కానీ స్టార్ దర్శకులతో గోపి ఆవకాశం అందుకోవడం లేదు. టైమ్ బ్యాడ్ అయినప్పుడు ఎవరు ఏం చేయలేరు. కానీ గోపి విలన్ నుంచి చాలా కష్టపడి హీరోగా పైకొచ్చాడు. ఫెయిల్యూర్స్ అతనికి కొత్త కాదు. మరి పంతంతో గోపి కెరీర్ ను మళ్లీ సెట్ చేసుకుంటాడో లేదో చూడాలి.