Begin typing your search above and press return to search.

అర్జున్‌ రెడ్డిపై ఉన్న ఆసక్తి పోగొడుతున్నారు

By:  Tupaki Desk   |   20 Oct 2019 8:39 AM GMT
అర్జున్‌ రెడ్డిపై ఉన్న ఆసక్తి పోగొడుతున్నారు
X
విజయ్‌ దేవరకొండ హీరోగా సందీప్‌ రెడ్డి వంగ దర్శకత్వంలో వచ్చిన 'అర్జున్‌ రెడ్డి' ఎంతటి సెన్షేషనల్‌ సక్సెస్‌ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అర్జున్‌ రెడ్డి హిందీ రీమేక్‌ 'కబీర్‌ సింగ్‌' కూడా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఒరిజినల్‌ వర్షన్‌ మరియు హిందీ డబ్బింగ్‌ రెండు సినిమాలు కూడా సూపర్‌ హిట్‌ అయినా తమిళ 'అర్జున్‌ రెడ్డి' అయిన 'ఆధిత్య వర్మ' మేకర్స్‌ మాత్రం ఎందుకో భయపడుతున్నారు. తమిళంలో అర్జున్‌ రెడ్డి అనగానే తమిళ తంబీలు అంతా ఎంతో ఆసక్తిని.. అంచనాలను పెంచుకున్నారు.

వర్మ టైటిల్‌ తో మొదట సినిమా ప్రారంభం అయ్యి షూటింగ్‌ దాదాపుగా పూర్తి అయిన తర్వాత బాగా రాలేదని పూర్తిగా రీ షూట్‌ చేయాలని నిర్ణయించుకున్నారు. రీ షూట్‌ పూర్తి అయ్యి కూడా నెలలు గడిచి పోతుంది. కాని విడుదలకు మాత్రం మీనమేశాలు లెక్కిస్తున్నారు. ఈ చిత్రంతో విక్రమ్‌ తనయుడు ధృవ్‌ హీరోగా పరిచయం అవుతున్నాడు. మంచి డేట్‌ చూసి విడుదల చేయాలని.. పోటీ లేని సమయంలో విడుదల చేయాలని వరుసగా వాయిదాలు వేస్తున్న కారణంగా సినిమాపై జనాల్లో ఆసక్తి తగ్గుతుంది.

సినిమాపై నమ్మకం ఉంటే షూటింగ్‌ పూర్తి అయిన వెంటనే విడుదల చేసేవారని.. వారికే సినిమాపై నమ్మకం లేని కారణంగా సరైన సమయం కోసం వెయిట్‌ చేస్తున్నారంటూ కామెంట్స్‌ వినిపిస్తున్నాయి. అలాంటప్పుడు ప్రేక్షకులు ఆధిత్య వర్మపై ఆసక్తిని ఎలా పెంచుకుంటారంటూ సినీ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. ఆధిత్య వర్మ మేకర్స్‌ ప్రమోషన్‌ విషయంలో పూర్తిగా విఫలం అవుతున్నారు. మొదటి సారి బాగా రాలేదని రీ షూట్‌ చేశారు, ఇప్పుడేమో సినిమాకు ప్రమోషన్‌ చేసే విషయంలో జోరు చూపించలేక పోతున్నారు. దాంతో తెలుగు.. హిందీలో సెన్షేషనల్‌ సక్సెస్‌ అయిన ఈ చిత్రం తమిళంలో మాత్రం ఆసక్తిని పోగొట్టుకుంది.

కబీర్‌ సింగ్‌ చిత్రం విడుదలై సక్సెస్‌ అయిన వెంటనే ఆధిత్య వర్మను విడుదల చేసి ఉంటే మంచి పబ్లిసిటీ దక్కడంతో పాటు తప్పకుండా సినిమాకు ఉన్న బజ్‌ తో మంచి వసూళ్లు నమోదు అయ్యేవి. కాని ఆ సమయంలో షూటింగ్‌ అవ్వలేదని.. పోటీగా సినిమాలు ఉన్నాయంటూ ఆధిత్య వర్మ మేకర్స్‌ భయపడ్డారు. దాంతో ఇప్పుడు మొదటికే మోసం వచ్చింది. ఇప్పుడు ఆధిత్య వర్మ వచ్చినా జనాలు పట్టించుకునే పరిస్థితి లేదని తమిళ సినీ వర్గాల్లో టాక్‌ వినిపిస్తుంది. మళ్లీ ఏదైనా అద్బుతం జరిగి ప్రమోషన్స్‌ బాగా చేస్తే తప్ప ఆధిత్య వర్మను జనాలు పట్టించుకునే పరిస్థితి కనిపించడం లేదు.