Begin typing your search above and press return to search.
‘అర్జున్ రెడ్డి’ బూతులు వాళ్లు వినొచ్చు
By: Tupaki Desk | 26 Aug 2017 11:04 AM GMT‘అర్జున్ రెడ్డి’ సినిమాలో బూతుల గురించి పెద్ద చర్చే నడిచింది. ఆర్నెల్ల కిందట రిలీజ్ చేసిన ‘అర్జున్ రెడ్డి’ ఫస్ట్ టీజర్లోనే పెద్ద బూతు దొర్లింది. ‘ఏం మాట్లాడుతున్నావ్ రా...’ అంటూ టీజర్ చివర్లో అర్జున్ రెడ్డి పెద్ద బూతే పలికాడు. దీని విషయంలో చాలా పెద్ద వివాదమే నడిచింది. సెన్సార్ వాళ్లు టీజర్లోని బూతుల గురించి కూడా ప్రశ్నించినట్లు దర్శకుడు మొన్నటి ప్రి రిలీజ్ ఈవెంట్లో వెల్లడించాడు. ఈ సినిమాకు ‘ఎ’ సర్టిఫికెట్ ఇవ్వడంతో పాటు దాదాపు 15 చోట్ల బూతులతో పాటు కొన్ని అభ్యంతరకర మాటలకు మ్యూట్ వాడాలని ఆదేశించారు. దీనిపై ఇటు హీరో.. అటు దర్శకుడు ఇద్దరూ కూడా ఫైర్ అయ్యారు. ప్రి రిలీజ్ ఈవెంట్లో సెన్సార్ వాళ్లను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు.
‘అర్జున్ రెడ్డి’ సినిమా చూస్తుంటే.. పలు చోట్ల మ్యూట్ రావడం.. మాటలు వినిపించకపోవడం గమనించవచ్చు. తాము జెన్యూన్ గా ఓ సినిమా తీశామని.. ఆయా పాత్రల ఎమోషన్లను వాస్తవికంగా చూపించామని.. ఈ మాటలకు కోత పెట్టేయడం వల్ల ప్రేక్షకులు ఫీల్ కోల్పోతారని అంటోంది చిత్ర బృందం. ఐతే ఈ మాటలు మన ప్రేక్షకులు మిస్సయినప్పటికీ ఓవర్సీస్ ప్రేక్షకులకు మాత్రం ఈ ఇబ్బంది లేదు. అక్కడ కట్స్ ఏమీ లేకుండా ఈ సినిమాను అనుమతించింది సెన్సార్ బోర్డు. సినిమాలోని అన్ని బూతులు.. అన్ని మాటలూ అక్కడి ప్రేక్షకులు వినొచ్చన్నమాట. మరి సినిమా చూస్తూ వాళ్ల ఫీలింగ్ ఎలా ఉందో? యుఎస్ లో ఈ సినిమాకు ప్రిమియర్ల నుంచే 2 లక్షల డాలర్ల దాకా వసూళ్లు వచ్చాయి. అక్కడ ఈజీగా ఈ సినిమా మిలియన్ డాలర్ మార్కును దాటే అవకాశముంది.