Begin typing your search above and press return to search.

అడ్వాన్స్ డీల్స్ కి ఛాన్స్ లేదు పుష్పా!

By:  Tupaki Desk   |   30 Jun 2022 3:30 AM GMT
అడ్వాన్స్ డీల్స్ కి ఛాన్స్ లేదు పుష్పా!
X
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ న‌టించిన మోస్ట్ ప్రెస్టీజియ‌స్ మూవీ 'పుష్ప‌'. స్టార్ డైరెక్ట‌ర్ సుకుమార్ అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కించిన ఈ మూవీలో బ‌న్నీ తొలిసారి ఊర మాస్ పాత్ర‌లో గంధ‌పు చెక్క‌ల స్మ‌గ్ల‌ర్ పుష్ప‌రాజ్ గా న‌టించారు. ఇదే ఈ మూవీకి ప్ర‌ధాన యుఎస్ పీగా మారి సినిమా వ‌ర‌ల్డ్ వైడ్ గా వైర‌ల్ అయ్యేలా చేసింది. పాన్ ఇండియా వైడ్ గా బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచేలా చేసింది. భారీ అంచ‌నాల మ‌ధ్య విడుద‌లైన ఈ మూవీ ఉభ‌య తెలుగు రాష్ట్రాల‌తో పాటు దేశ వ్యాప్తంగా మంచి వ‌సూళ్ల‌ని రాబ‌ట్టింది.

ఉత్త‌రాదిలో మ‌రీ ప్ర‌ధానంగా హిందీ బెల్ట్ లో ఈ మూవీ రికార్డు స్థాయిలో రూ. 120 కోట్లు రాబ‌ట్టి ట్రేడ్ వ‌ర్గాల‌ని విస్మ‌యానికి గురిచేసింది. దీంతో ఫ‌స్ట్ పార్ట్ కి ల‌భించిన క్రేజ్ ని, అప్లాజ్ ని దృష్టిలో పెట్టుకుని మేక‌ర్స్ పార్ట్ 2 ని మ‌రింత భారీగా, మ‌రిన్ని ప్ర‌త్యేక‌త‌ల‌తో ప్లాన్ చేస్తున్నారు. పార్ట్ 2 కు దాదాపు రూ. 400 కోట్ల మేర బ‌డ్జెట్ ని కేటాయిస్తున్న‌ట్టుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. అయితే పార్ట్ 1 విష‌యంలో జ‌రిగిన త‌ప్పులని పార్ట్ 2 కు రిపీట్ చేయోద్ద‌ని మేక‌ర్స్ భావిస్తున్నార‌ట‌.

ఈ మూవీ క్రేజ్‌ని బాలీవుడ్ లో అంచ‌నా వేయ‌లేక‌పోయిన మేక‌ర్స్ చాలా త‌క్కువ మొత్తానికి బాలీవుడ్ మేక‌ర్స్ ఈ మూవీ డ‌బ్బింగ్ హ‌క్కుల్ని ఇచ్చేశారు. దీంతో 'పుష్ప‌' టీమ్ భారీగా బాలీవుడ్ లాభాల్ని కోల్పోవాల్సి వ‌చ్చింద‌ట‌. అయితే ఈ ద‌ఫా అలాంటి అడ్వాన్స్ డీల్స్ ని పెట్టుకోవ‌డం లేద‌ని తెలుస్తోంది. ఇప్ప‌టికే బాలీవుడ్ నుంచి భారీ నిర్మాణ సంస్థ‌లు 'పుష్ప 2' హిందీ హ‌క్కుల్ని ఇవ్వ‌మ‌ని భారీ మొత్తాన్ని మేక‌ర్స్ కి ఆఫ‌ర్ చేస్తున్నార‌ట‌.

అయితే ఈ సారి అడ్వాన్స్ డీల్స్ కి ఛాన్స్ లేదు పుష్పా అంటూ పుష్ప టీమ్ వ‌చ్చిన ఆఫ‌ర్ల‌ని సున్నితంగా తిర‌స్క‌రిస్తోంద‌ట‌. 'పుష్ప‌' ని బాలీవుడ్ డ‌బ్బింగ్ హ‌క్కుల్ని గోల్డ్ మైన్స్ సంస్థ‌కు అమ్మేశారు.

యూట్యూబ్ రిలీజ్ తో పాటు ఈ సంస్థ థియేట్రిక‌ల్ గానూ సినిమాని విడుద‌ల చేసింది. భారీ స్థాయిలో క‌లెక్ష‌న్ ల‌ని సినిమా రాబ‌ట్ట‌డంతో అందులో ఎలాంటి వాటాని మైత్రీ వారికి అందించ‌లేదు. దీంతో ఈ సారి అలాంటి త‌ప్పులు జ‌ర‌క్కుండా ప‌క్కా ప్ర‌ణాళిక ప్ర‌కారం 'పుష్ప 2' ని రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేస్తున్నార‌ట‌.

గ‌త అనుభ‌వాల‌ని దృష్టిలో పెట్టుకుని 'పుష్ప 2' హిందీ ప్ర‌ద‌ర్శిన హ‌క్కుల్ని ఏఏ ఫిల్మ్స్ కి కానీ...ట్రిపుల్ ఆర్ ని విడుద‌ల చేసిన పెన్ స్టూడియోస్ కి కాని ఇవ్వాల‌ని, అందులోనూ క‌మీష‌న్ బేస్ సిస్ట‌మ్ లోనే ఇవ్వాల‌ని మైత్రీ మూవీ మేక‌ర్స్ వారు ప్లాన్ చేస్తున్నార‌ట‌. మ‌రి ఈ రెండు సంస్థ‌ల్లో ఏది 'పుష్ప 2' ని క‌మీష‌న్ బేసిస్ విడుద‌ల చేయ‌డానికి ముందుకొస్తుందో చూడాలి.