Begin typing your search above and press return to search.
'ఆర్ ఆర్ ఆర్' అదేరోజు రిలీజ్ కానుందా..?
By: Tupaki Desk | 25 March 2020 1:35 PM GMTప్రస్తుతం టాలీవుడ్ తో పాటు దేశం మొత్తం ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా.. అని ఎదురుచూస్తున్న సినిమా "ఆర్ ఆర్ ఆర్". దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పై సినీ ప్రేక్షకులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. రాంచరణ్ - ఎన్టీఆర్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా గురించి ఒక్కో విషయాన్నీ బయటపెడుతున్నారు దర్శకనిర్మాతలు. కరోనా ఎఫెక్ట్ తో షూటింగ్ నిలిచిపోయిన ఈ సినిమా మోషన్ పోస్టర్ ను నేడు చిత్రయూనిట్ విడుదల చేసింది. ప్రేక్షకులను 'ఆర్ ఆర్ ఆర్' మోషన్ పోస్టర్ విశేషంగా ఆకట్టుకుంటుంది.
ఈ సంవత్సరం జులై 30న రిలీజ్ కావాల్సిన ఆర్ ఆర్ ఆర్ సినిమాను కొన్ని నెలల క్రితమే వచ్చే ఏడాది జనవరిన రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. త్వరగా షూటింగ్ ముగిద్దాం అనుకుంటున్న టైంలో కరోనా వైరస్ ప్రబలడంతో షూటింగ్ నిలిపేశారు. కానీ చిత్రయూనిట్ పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించే దిశగా ప్లాన్ చేస్తున్నారట. కరోనా ఎఫెక్ట్ తో మళ్లీ సినిమా విడుదల వాయిదా పడుతుంది అనుకున్నారంతా.. కానీ మోషన్ పోస్టర్ లో 2021జనవరి 8న విడుదల చేయనున్నట్లు స్పష్టంగా తెలిపారు. మరో విషయం ఏంటంటే.. ఈ సినిమా నుండి అలియా భట్ తప్పుకున్నట్లు వార్తలొచ్చాయి. అది నిజం కాదని తెలియజేస్తూ పోస్టర్ లో అలియా పేరును చేర్చారు. అంటే అలియా కూడా సినిమాలో ఉన్నట్లు అర్థం అవుతుంది.