Begin typing your search above and press return to search.
తెలుగు '96' ఎప్పుడు బాబోయ్!
By: Tupaki Desk | 25 Oct 2019 2:30 PM GMTతమిళ క్లాసిక్ చిత్రాల్లో ఒకటిగా '96' చిత్రం నిలిచిపోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. భాషతో సంబంధం లేకుండా 96 చిత్రాన్ని అందరు కూడా ఆధరించారు. తెలుగు ప్రేక్షకులు కూడా చాలా మంది 96 ను చూశారు. ఇప్పుడు తెలుగులో 96 రీమేక్ కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. శర్వానంద్ మరియు సమంత ప్రధాన పాత్రల్లో దిల్ రాజు ఈ రీమేక్ ను నిర్మిస్తున్నాడు. ఒరిజినల్ వర్షన్ కు డైరెక్ట్ చేసిన ప్రేమ్ కుమార్ తెలుగు రీమేక్ కు దర్శకత్వం వహిస్తున్నాడు.
సినిమా షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది. ఇప్పటికే సమంత తన పార్ట్ ను పూర్తి చేసింది. మరో రెండు లేదా మూడు వారాల పాటు షూట్ చేస్తే మొత్తం షూటింగ్ పూర్తి అవుతుందని సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. 96 చిత్రం గురించి మీడియాలో వస్తున్న వార్తలు.. జనాలు చర్చించుకోవడం చూసి చాలా మందికి తెలుగు 96 రీమేక్ పై ఆసక్తి కలుగుతుంది. ఎప్పుడో ప్రారంభం అయిన ఈ చిత్రం స్లోగా తెరకెక్కుతుంది. ఎప్పుడెప్పుడు ఈ చిత్రం వస్తుందా అంటూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఎట్టకేలకు షూటింగ్ ముగింపు దశకు వచ్చింది కనుక సినిమాను వచ్చే ఏడాది ఆరంభంలో విడుదల చేసే అవకాశాలు ఉన్నాయనిపిస్తుంది. సినీ వర్గాల్లో కొందరు ఈ సినిమాను ఫిబ్రవరి రెండవ వారంలో ప్రేమికుల రోజు సందర్బంగా విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా చెబుతున్నారు. ఇంకా ఈ విషయమై ఎలాంటి క్లారిటీ అయితే రాలేదు. కాని తెలుగు ప్రేక్షకులు మాత్రం ఈ క్లాసిక్ రీమేక్ కోసం కోట్లాది కళ్లతో ఎదురు చూస్తూ ఇంకా ఎప్పుడు బాబోయ్ అంటూ ప్రశ్నిస్తున్నారు.