Begin typing your search above and press return to search.
RRR దెబ్బకు వెనక్కి తగ్గిన గంగుబాయి..!
By: Tupaki Desk | 15 Nov 2021 7:52 AM GMTఇటీవల పాన్ ఇండియా చిత్రాలన్నీ వరుస పెట్టి విడుదల తేదీలను అనౌన్స్ చేయడంతో, కొన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ మధ్య క్లాష్ ఏర్పడే పరిస్థితి వచ్చింది. ముఖ్యంగా 'RRR' మూవీ విడుదల తేదీని ప్రకటించడంతో చాలా సినిమాల రిలీజ్ డేట్స్ విషయంలో గందరగోళం ఏర్పడింది. రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ట్రిపుల్ ఆర్ చిత్రాన్ని వచ్చే ఏడాది ప్రారంభంలో జనవరి 7న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు ప్రకటించారు.
జక్కన్న సినిమాతో పోటీపడాలని ఎవరూ అనుకోరు కాబట్టి.. ఇప్పటికే విడుదల తేదీలను ప్రకటించిన కొన్ని చిత్రాలు వాయిదా వేసుకున్నాయి. మరికొన్ని పోస్ట్ పోన్ గురించి అధికారికంగా అనౌన్స్ చేయడానికి రెడీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా 'గంగుబాయి కథివాడి' చిత్రాన్ని వాయిదా వేస్తూ మేకర్స్ కొత్త రిలీజ్ డేట్ ని ప్రకటించారు.
RRR విడుదల తేదీని లాక్ చేయకముందే 'గంగుబాయి కథివాడి' చిత్రాన్ని వచ్చే జనవరి 6న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. అలియా భట్ ప్రధాన పాత్రలో సంజయ్ లీలా బన్సాలీ ఈ సినిమాని రూపొందించారు. పెన్ స్టూడియోస్ జయంతి లాల్ గడ - సంజయ్ లీలా బన్సాలీ కలిసి నిర్మించిన ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కు ప్లాన్ చేశారు.
ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే, రెండు చిత్రాల్లోనూ అలియా భట్ హీరోయిన్ గా నటించగా.. అజయ్ దేవగన్ కీలక పాత్ర పోషించారు. రెండు సినిమాలను థియేట్రికల్ రిలీజ్ చేయాల్సింది కూడా పెన్ స్టూడియోస్ వారే. రెండు సినిమాల నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్స్ నటీనటులు ఒకరే కాబట్టి.. ఒక్క రోజు గ్యాప్ విడుదల చేయడం అంటే నష్టాలు కోరి తెచ్చుకున్నట్లే. అందుకే పునరాలోచన చేసిన మేకర్స్.. ఇప్పుడు 'గంగూబాయి' చిత్రాన్ని వాయిదా వేయాలని నిర్ణయించుకున్నారు.
'గంగుబాయి కథియావాడి' చిత్రాన్ని 2022 ఫిబ్రవరి 18న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఈరోజు సోమవారం అధికారికంగా ప్రకటించారు. దీంతో హిందీ మార్కెట్ లలో RRR కి మంచి రన్ కోసం మార్గం సుగమం అయింది. ఈ నేపథ్యంలో రాజమౌళి ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. "విడుదల తేదీని మార్చాలని శ్రీ జయంతీలాల్ గడ మరియు శ్రీ సంజయ్ లీలా భన్సాలీ తీసుకున్న నిర్ణయం అభినందనీయం. 'గంగుబాయి కతియావాడి' కి మా హృదయపూర్వక శుభాకాంక్షలు" అని పేర్కొన్నారు.
కాగా, హుస్సేన్ జైదీ రచించిన ‘మాఫీయా క్వీన్స్ ఆఫ్ ముంబై’ లోని ‘మేడమ్ ఆఫ్ కామతిపుర’ ఆధారంగా ''గంగుబాయి కథియావాడి'' చిత్రం తెరకెక్కుతోంది. పవర్ ఫుల్ గంగుబాయి పాత్రలో అలియా భట్ కనిపించనుంది. బాలీవుడ్ స్టార్స్ అజయ్ దేవగణ్ - ఇమ్రాన్ హష్మి - హ్యూమా ఖురేషి ఇందులో కీలక పాత్రల్లో నటించారు. హిందీ మరియు తెలుగుతో పాటుగా మరికొన్ని ప్రాంతీయ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. గతేడాది సెప్టెంబర్ లో రిలీజ్ కావాల్సిన 'గంగూబాయి'.. అనేక వాయిదాల అనంతరం వచ్చే ఫిబ్రవరి 18న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.