Begin typing your search above and press return to search.
ఎన్టీఆర్, చరణ్ సినిమాలకు లింకే లేదు
By: Tupaki Desk | 20 Jan 2016 9:30 AM GMTఇప్పటివరకు తని ఒరువన్ ఒరిజినల్ స్టోరీని లీక్ చేస్తే బహుశా తెలుగులో రామ్ చరణ్ రీమేక్ తాలూకు కిక్ పోతుంది కాబట్టి.. అందరూ ఆ కథ గురించి మాట్లాడకుండా ఉండిపోయారు. కాని ఇప్పుడు నాన్నకు ప్రేమతో.. తని ఒరువన్ సినిమాలకు మధ్యన కంపారిజన్ ఎక్కువైపోవడంతో.. అసలు ఈ రెండు సినిమాలకు ఉన్న లింకేంటో చూడక తప్పట్లేదు మరి.
తని ఒరువన్.. నాన్నకు ప్రేమతో.. ఈ రెండు సినిమాలకూ సంబంధించి చెబుతున్న కామన్ అంశం.. సిసి కెమెరా సీన్. ఎన్టీఆర్ సినిమాలో పెయింటింగులో సిసి కెమెరా పెట్టడం అనేది.. ఆఖరిలో రివీల్ చేసే ఒకే ఒక్క షాట్ మాత్రమే. కాని తని ఒరువన్ లో ఏకంగా మనిషి బాడీలో వాయిస్ మైక్ పెడతారు. పైగా అది సెకండాఫ్ మొత్తం ఉంటుంది. అసలు ఈ రెండు సీన్లకూ అస్సలు సంబంధం లేనే లేదు. ఇక్కడ హీరో విలన్ కు పెడితే.. అక్కడ అది రివర్సులో ఉంటుంది. కథ పరంగా చూస్తే.. తని ఒరువన్ సినిమా అంతా ఆర్గనైజ్డ్ క్రయిమ్ గురించి జరిగే ఒక స్టోరీ. ఒక పోలీస్ ఆఫీసర్ కొన్ని హత్యలను పర్సనల్ గా తీసుకుని చేసే ఇన్వెస్టిగేషన్. అదే నాన్నకు ప్రేమతో అయితే.. ఒక రివెంజ్ డ్రామా. విలన్ విషయానికొస్తే.. జగపతి బాబు వేరేవారిని మోసం చేసి బిలియనీర్ అవుతాడు. తని ఒరువన్ లో విలన్ అరవింద్ స్వామి చిన్నప్పటి నుండీ అవకాశాలను వాడుకొని.. క్రయిమ్ ను కలుపుకొని.. పైకొస్తాడు. అసలు క్యారెక్టరైజేషన్ లో ఎటువంటి పోలికా లేదు.
ఇక ఎన్టీఆర్ కు హీరోయిన్ తో బీభత్సమైన లవ్ ట్రాక్ ఉంది. తని ఒరువన్ సినిమాలో అలాంటిదేం లేదు. కాకపోతే సెకండాఫ్ లో వచ్చే ఒక లవ్ ప్రపోజల్ సీన్ మాత్రం కేక. సో.. ఈ రెండు సినిమాల కథా కథనం ఒకటే అని ఫీలవుతున్న మెగా ఫ్యాన్స్ కు సినిమా లవర్లకు క్లారిటీ వచ్చేసినట్లేనా మరి? చరణ్ ఈ రీమేక్ ను చేయడంలో వచ్చే నష్టం కష్టం ఏమీ లేదు గురూ!!