Begin typing your search above and press return to search.
గ్యారేజ్ అంటే అంత భయమా?
By: Tupaki Desk | 22 Aug 2016 11:30 AM GMTసమ్మర్లో ‘సరైనోడు’ వచ్చాక.. మళ్లీ ఆ స్థాయిలో బాక్సాఫీస్ ను కళకళలాడించిన భారీ సినిమా మరేదీ లేదు. ఎన్నో ఆశలు పెట్టుకున్న ‘బ్రహ్మోత్సవం’ దారుణమైన ఫలితాన్ని చవిచూసింది. చాలా విరామం తర్వాత ఇప్పుడు ‘జనతా గ్యారేజ్’ వస్తోంది. ఈ సినిమా విడుదలకు ఇంకో పది రోజులే సమయం ఉంది. క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ఎలాంటి అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆ అంచనాలు చూసి భయపడే దానికి పోటీగా కాదు కదా.. ముందు వారం కూడా తమ సినిమాల్ని రిలీజ్ చేయడానికి దర్శక నిర్మాతలు భయపడిపోతున్నారు. రాబోయే శుక్రవారం.. అంటే ‘జనతా గ్యారేజ్’ విడుదలకు ముందు వారం ఓ మోస్తరు చిన్న సినిమా కూడా ఏదీ రిలీజవ్వట్లేదు.
ఉన్నంతలో ఆ మధ్య త్రివిక్రమ్ ట్రైలర్ రిలీజ్ చేసిన హార్రర్ మూవీ ‘అవసరానికో అబద్ధం’ ఉంది. ఇది కాకుండా మలయాళ డబ్బింగ్ సినిమా ‘100 డేస్ ఆఫ్ లవ్’ను రిలీజ్ చేస్తున్నారు. ఇంకా బంతిపూల జానకి.. ప్రేమంటే సులువు కాదురా అంటూ జనాలకు పెద్దగా తెలియని సినిమాలు విడుదల చేస్తున్నారు. వీటిలో ఏదీ కూడా ప్రేక్షకుల్ని అంతగా ఆకర్షించే సినిమా కాదు. ఇక జనతా గ్యారేజ్ రిలీజయ్యాక తర్వాతి వారం వచ్చే సినిమాల విషయంలోనూ సందేహాలున్నాయి. ఆ వారానికి ఈడు గోల్డ్ ఎహే.. ప్రేమమ్.. డబ్బింగ్ మూవీ ‘ఇంకొక్కడు’ షెడ్యూల్ అయి ఉన్నాయి. ఐతే ఈ మూడూ ఒకేసారి వస్తాయని గ్యారెంటీగా చెప్పలేం. అది ‘జనతా గ్యారేజ్’ ఫలితాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. సినిమాకు అనుకున్నట్లే బ్లాక్ బస్టర్ టాక్ వస్తే.. కనీసం రెండు సినిమాలు పక్కకు వెళ్లిపోతాయి.