Begin typing your search above and press return to search.
హీరోలను డైరెక్టర్లను కంట్రోల్లో పెట్టిన స్టార్ హీరోయిన్
By: Tupaki Desk | 4 April 2020 5:40 AM GMTసినీ ఇండస్ట్రీలో అంటేనే మేల్ డామినేషన్ ఉన్న పరిశ్రమ. ఎంత కష్టపడినా కూడా హీరోలకు ఉన్న గుర్తింపు, ఇమేజ్, మార్కెట్ హీరోయిన్లకు ఉండదు. ఎవరెన్ని చెప్పినా కూడా ఇదే నిజం. చాలా మంది హీరోయిన్లు కూడా ఈ నిజాన్ని ఓపెన్‌గానే ఒప్పుకున్నారు కూడా. హీరోయిన్లకు ఎంత కష్టపడినా కూడా సరైన గుర్తింపు కానీ.. డబ్బులు కానీ రావడం లేదని వాళ్లు చాలా సార్లు మొర పెట్టుకున్నారు కూడా. కొత్త హీరోయిన్ల సంగతి చెప్పక్కర్లేదు. కొత్త హీరోయిన్లలో చాలా మంది అవకాశాలు రావనే భయంతోనో లేదా సినిమా మైకంలో పడడం వల్లనో డైరెక్టర్ లేదా హీరోలకి లోబడి నడుచుకుంటూ ఉంటారనేది అందరికి తెలిసిన సత్యమే. అయితే టాలీవుడ్ లో ప్రస్తుతం స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతున్న ఒక భామ విషయంలో మాత్రం ఇది జరగలేదు.
ఈ అమ్మడు సినీ ఇండస్ట్రీకి పరిచయమైనప్పటి నుండి అందరితో స్నేహంగా మసలుకుంటూనే ఎవరికీ ఎలాంటి ఛాన్స్ ఇవ్వకుండా ఇక్కడి దాకా వచ్చిందంట. మొదట్నుంచి ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచుతూ లౌక్యంతో నడుచుకుంటూ వస్తోందట. ఆమె తీరు తెలిసి అందరూ చాలా జాగ్రత్తగా నడుచుకుంటూ ఉంటారని, ఎంత పెద్ద హీరో అయినా, దర్శకుడు అయినా కానీ ఆ ముద్దుగుమ్మ అసలు లెక్క చేయదని ఇండస్ట్రీలో అనుకుంటూ ఉంటారు. తన టాలెంట్ చూసి ఛాన్స్ ఇచ్చారు కాబట్టి వాళ్ళకి తన అవసరం ఉంది కాబట్టి తన రేంజ్ తానూ మెయింటైన్ చేస్తూ వస్తుందట. వరుస విజయాలతో దూసుకుపోతున్న ఈ అమ్మడు డేట్స్ కోసం స్టార్ హీరోలు సైతం వెయిట్ చేయాల్సిందే. ఈ మధ్యే సూపర్ హిట్ అందుకున్న ఈ భామ ప్రస్తుతం రెండు బడా ప్రాజెక్టులను పూర్తి చేసే పనిలో ఉంది. అంతేకాకుండా బాలీవుడ్ లో కూడా అవకాశాలు వెల్లువలా వచ్చి పడటంతో ఆచితూచి అడుగులు వేస్తూ వస్తుందట. ఏదేమైనా ఇండస్ట్రీ లో నెగ్గుకు రావాలంటే ఈ బ్యూటీ లాగే లౌక్యం తెలిసి ఉండాలని మిగతా హీరోయిన్లు అనుకుంటున్నారు.