Begin typing your search above and press return to search.

బ్యాంకులు కూడా సినిమా ధియేటర్లేనా!!

By:  Tupaki Desk   |   30 Nov 2016 5:30 PM GMT
బ్యాంకులు కూడా సినిమా ధియేటర్లేనా!!
X
కొన్ని సంవత్సరాలుగా అసలెప్పుడూ బ్యాంకుల ముఖం చూడనివారు కూడా ఇప్పుడు బ్యాంకు క్యూల్లో నుంచుంటున్నారు. థ్యాంక్స్ టు మోడీజి. కొంతమంది డబ్బులు వేస్కోవడానికి.. కొందరు తీసుకోవడానికి.. ఇలా బ్యాంకులవైపు చూడక తప్పట్లేదు. ఇకపోతే ఈ తీసుకునే గ్యాంగ్ ఉంది చూశారు.. వీరికి మాత్రం బ్యాంకులకీ ధియేటర్లకీ పెద్దగా తేడా కనపించట్లేదట. అబ్బే బ్యాంకుల్లో డివిడిలు పెట్టి సినిమాలేమీ వేయట్లేదు. పదండి అసలు సంగతేంటో చూద్దాం.

చాలాచోట్ల చిన్న చిన్న టౌనుల్లో ధియేటర్ల వారు ఒక పద్దతి ఫాలో అవుతుంటారని ఎప్పటి నుండో టాక్. సినిమా ధియేటర్ బయట క్యూలో ఒక 200 మంది నుంచుంటే.. కేవలం 50 మందికి టిక్కెట్లు ఇచ్చాక హౌస్ ఫుల్ అని బోర్డ్ పెట్టేస్తుంటారు. అదేంటయ్యా అంటే.. చాలా టిక్కెట్లు రికమండేషన్ మీద అయిపోయాయ్ అంటుంటారు. తీరా చూస్తే బయట బ్లాకులో అమ్మేవాడి దగ్గర మాత్రం కట్టల కట్టల టిక్కెట్లు కనిపిస్తాయ్. ఇప్పుడు బ్యాంకుల పరిస్థితి కూడా ఇదే విధంగా ఉంది అంటున్నారు సామాన్య జనం. మనోళ్ళు క్యూలో నుంచున్న వారికి డబ్బులు లేవంటూ ప్లేట్లు తిప్పేస్తున్నారు. కాని కొంతమంది బడా బాబుల దగ్గర మాత్రం 2000 రూపాయల నోట్ల కట్టలే దర్శనమిస్తున్నాయి. అందుకే ధియేటర్ల మేనేజర్లకీ బ్యాంకుల మేనేజర్లకీ పెద్దగా తేడా కనిపించట్లేదట జనాలకు.

ఆ విధంగా మోడీ జీ దెబ్బకి బ్యాంకులు కూడా సినిమా ధియేటర్ల టైపులో మారిపోయాయ్ అంటూ కొందరు కామెడీ చేస్తుండగా.. మిగిలినవారు మాత్రం బ్లాకులో కొనుక్కునో లేదా రికమండేషన్ తో టిక్కట్లు తెచ్చుకునో ఎలాగైతే సినిమాను చూస్తారో.. ఇప్పుడు అదే విధంగా ఏదో రకంగా కొత్త నోట్లను సంపాదిస్తున్నారు. పని జరగడం ముఖ్యం.. విధానం ఏముందిలే అనుకునే లోకం.. ఇంతే సంగతులు చిత్తగించవలెను!!


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/