Begin typing your search above and press return to search.
ప్రభాస్ క్లారిటీ ఇచ్చాడుగా
By: Tupaki Desk | 22 May 2018 10:15 AM GMTసాహో షూటింగ్ కోసం దుబాయ్ లో అలుపెరగకుండా యాక్షన్ సీక్వెన్స్ చేస్తున్న ప్రభాస్ అబూ దాబిలో మీడియాతో ఇంటరాక్ట్ అయిన సందర్బంగా పలు విషయాల గురించి క్లారిటీ ఇచ్చాడు. బాహుబలి హిందీ వెర్షన్ నిర్మాత కరణ్ జోహార్ తో తనకు విభేదాలు ఉన్నట్టు వచ్చిన వార్తలను పూర్తిగా ఖండించాడు. తనకు బాలీవుడ్ డెబ్యూ కోసం కరణ్ ఇచ్చిన ఆఫర్ ని తాను ఒప్పుకోలేదని అందుకే ఇద్దరి మధ్య అప్పటి నుంచి మాటలు లేవన్న దానికి క్లారిటీ ఇస్తూ అలాంటిది ఏమి లేదని తాము చక్కని ఫ్రెండ్స్ అంటూ పుకార్లకు చెక్ పెట్టాడు. కరణ్ జోహార్ ఇదే విషయమై తనను ఫోన్ లో సంప్రదిస్తే ఇద్దరం కలిసి నవ్వుకున్నామని తేల్చి చెప్పాడు. సో ప్రభాస్ కరణ్ స్నేహానికి వచ్చిన ముప్పేమీ లేదన్న మాట. అయితే హిందీ స్ట్రెయిట్ సినిమా చేయటం గురించి మాత్రం ప్రభాస్ నేరుగా సమాధానం ఇవ్వలేదు. దానికి సమయం పడుతుందని ఇప్పుడు తన దృష్టి అంతా తెలుగు సినిమాల మీదే ఉందని చెప్పాడు.
సాహో నుంచి బ్రేక్ తీసుకుని టీమ్ మొత్తం ఈ వారంలో వెనక్కు వచ్చే అవకాశాలు ఉన్నాయి. రంజాన్ పండగా సందర్బంగా రెగ్యులర్ గా షూటింగ్ చేసుకునే వెసులుబాటు అక్కడ ఉండదు. ఈ పాటికే కీలకమైన ఎపిసోడ్స్ తీసిన నేపథ్యంలో వచ్చే నెల తర్వాత ప్లాన్ చేయబోతున్నట్టు తెలిసింది. వార్తలు వచ్చాయని కాదు కానీ కరణ్ జోహార్ ప్రభాస్ బాలీవుడ్ ఎంట్రీ గురించి ప్రయత్నించింది మాత్రం నిజమే. కానీ కథ కుదరకపోవడం తొందరపడి ఏదో ఒకటి చేస్తే ఫలితం ఎలా ఉంటుందో గతంలో తెలుగు నుంచి బాలీవుడ్ లో ప్రయత్నాలు చేసిన స్టార్ హీరోల అనుభవం తదితరాలు పరిగణనలోకి తీసుకుని తాత్కాలికంగా బ్రేక్ వేశారు. అందుకే సాహోలో ప్రధాన తారాగణం మొత్తం బాలీవుడ్ బ్యాచే ఉంటుంది. సంగీత దర్శకులుగా శంకర్ ఎహసాన్ లాయ్ లను తీసుకోవడానికి కారణం కూడా అదే. దాదాపు వచ్చే సంవత్సరమే విడుదల అయ్యే అవకాశం ఉన్న సాహొ బడ్జెట్ పరంగా బాహుబలి తర్వాత స్థానంలో నిలుస్తుందని ఇన్ సైడ్ టాక్