Begin typing your search above and press return to search.
అమీర్ - షారుఖ్ - కరణ్ లకు గట్టిగా ఇచ్చింది
By: Tupaki Desk | 23 Jan 2016 1:18 PM GMTమత అసహనం విషయంలో బాలీవుడ్ సెలబ్రెటీలు రోజుకో వివాదాస్పద వ్యాఖ్యతో అగ్గి రాజేసే ప్రయత్నం చేస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా అమీర్ ఖాన్ ఆ మధ్య చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపాయి. మరోవైపు షారుఖ్ ఖాన్ - కరణ్ జోహార్ కూడా ఈ రొచ్చులోకి దిగి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లోకొచ్చారు. ఐతే వీళ్లందరూ దేశంలో మత అసహనం పెరిగిపోతోందన్న తరహాలో మాట్లాడితే సీనియర్ హీరోయిన్ కాజోల్ మాత్రం వారికి కౌంటర్ ఇచ్చింది. అసలు బాలీవుడ్ లో ఎక్కడా మత అసహనం లేదని.. అంతా హ్యాపీగా పని చేసుకుంటున్నారని.. మరి వీళ్లందరికీ ఎక్కడ అసహనం కనిపించిందో అర్థం కావడం లేదని వ్యాఖ్యానించింది కాజోల్.
రాజస్థాన్ లోని జైపూర్ లో జరుగుతున్న లిటరేచర్ ఫెస్టివల్ లో పాల్గొన్న కాజోల్ మీడియాతో మాట్లాడుతూ.. సమాజంలో ఏం జరిగినా.. అది తమ సినీ పరిశ్రమపై ప్రభావం చూపిస్తోందని.. ఐతే ఎలాంటి విషయాన్నయినా తాము స్వాగతిస్తామని ఆమె పేర్కొన్నారు. బాలీవుడ్ లో కులం - మతం అంటూ విభేదాలు లేవని.. అసహనం అంతకన్నా లేదని ఆమె స్పష్టం చేశారు. ప్రస్తుత రోజుల్లో ప్రజలు చాలా సున్నితంగా ఉంటున్నారని.. కాబట్టి ప్రముఖులు ఎప్పుడూ మంచి మాత్రమే మాట్లాడాలని పరోక్షంగా అమీర్ - షారుఖ్ లాంటి వాళ్లను ఉద్దేశించి ఆమె హితవు పలికారు.
ఇండియాలో ప్రజాస్వామ్యం ఓ జోక్ లాగా మారిందని.. ఏం మాట్లాడినా జైలుకెళ్లే పరిస్థితి ఉందని ఇదే లిటరేచర్ ఫెస్టివల్ లో కరణ్ జోహార్ వ్యాఖ్యినించిన సంగతి తెలిసిందే.