Begin typing your search above and press return to search.

ఇప్పుడంత ఇబ్బందేం ఉండదు

By:  Tupaki Desk   |   27 Feb 2018 5:20 AM GMT
ఇప్పుడంత ఇబ్బందేం ఉండదు
X
డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్ల కు వ్యతిరేకంగా మార్చి 2 నుంచి థియేటర్లు మూతపడనున్నాయి. ముందుగా తెలుగులోనే డిజిటల్ సర్వీసు ప్రొవైడర్ల తీరుపై తీవ్ర అభ్యంతరాలు వచ్చాయి. ఆ తరవాత దీనికి సౌత్ లో మిగిలిన భాషల నిర్మాతలు కూడా గొంతు కలిపారు. దీంతో మొత్తం దక్షిణ భారతదేశమంతటా మార్చి 2 తరవాత సినిమాల ప్రదర్శనలు నిలిపివేయనున్నారు. దీనిపై ఇరువర్గాలు ఇంతకుముందు చర్చలు జరిపినా పెద్దగా ఫలితం లేకపోవడంతో థియేటర్లు బంద్ చేసేందుకే డిసైడయ్యారు.

పిల్లలకు పరీక్షల సమయం అంటేనే సినిమా ఇండస్ట్రీకి అన్ సీజన్ కింద లెక్క. ఈ టైంలో థియేటర్లకు వచ్చేందుకు యూత్ ఇంట్రస్ట్ చూపరు. చదువుకునే పిల్లలున్న ఫ్యామిలీలైతే సినిమా హాళ్లవైపు కన్నెత్తి కూడా చూడవు. ఈ సీజన్ లో థియేటర్లన్నీ ఖాళీగా కనిపిస్తుంటాయి. అందుకే పరీక్షలయ్యేంత వరకు పెద్దసినిమాలేవీ రిలీజు చేయరు. మార్చి 30న రామ్ చరణ్ నటించిన రంగస్థలం మూవీ రిలీజయ్యేంత వరకు థియేటర్లలో కొత్త సినిమాల సందడి ఉండే ఛాన్సులేమీ లేవు. ఈ సీజన్ లో థియేటర్లు మూసేసినా పెద్దగా నష్టం ఉండద్నది నిర్మాతల ఆలోచన.

‘‘సౌత్ లో డిజిటల్ సర్వీసు ప్రొవైడర్లలో అత్యధికం మెగా ఫ్యామిలీకీ చెందిన అల్లు అరవింద్ చేతిలోనే ఉన్నాయి. మార్చి ఆఖరుకు వస్తున్న రంగస్థలం సినిమా మెగా ఫ్యామిలీదే. అప్పటికి థియేటర్లు తెరుచుకోకపోతే వాళ్లకూ నష్టమే. ఇప్పటివరకు నిర్మాతలంతా కలిసి ఏర్పడిన జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) అల్లు అరవింద్ తో నేరుగా మాట్లాడలేదు. అటు ఆయనా ఈ జేఏసీ మీటింగులకు రాలేదు . ఎవరికి వాళ్లు పట్టుదలతో ఉంటే ఈ సమస్య బిగుసుకుపోతుందే తప్ప పరిష్కారం దొరకదని’’ ఇండస్ట్రీలోని ఓ నిర్మాత ఒకింత ఆవేదనగా చెప్పుకొచ్చారు.