Begin typing your search above and press return to search.

మహర్షికి ఆ టెన్షన్ లేదు

By:  Tupaki Desk   |   15 March 2019 4:30 PM IST
మహర్షికి ఆ టెన్షన్ లేదు
X
మహేష్ బాబు అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న మహర్షి విడుదల మూడు సార్లు వాయిదా పడి ఫైనల్ గా మే 9 లాక్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ప్రకటన తర్వాత ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది. ఏప్రిల్ 11న పోలింగ్ మే 23 కౌంటింగ్ డేట్స్ ఇచ్చేశారు. అయితే వీటి ప్రభావం తమ హీరో సినిమా మీద పడుతుందేమో అన్న అనుమానం ఫాన్స్ లో లేకపోలేదు. కానీ మహర్షి వచ్చే టైంకి ఎలక్షన్ రిజల్ట్స్ కి మధ్య రెండు వారాల గ్యాప్ ఉంది.

మహేష్ లాంటి స్టార్ ఓపెనర్ కి బ్లాక్ బస్టర్ టాక్ వస్తే రెండు వారాల్లో పెట్టుబడి మొత్తం ఇచ్చేస్తాడు. అధికారంలోకి ఎవరు వస్తారు అనే ఉత్కంఠ జనాల్లో ఉన్నప్పటికీ సినిమాలను త్యాగం చేసి మరీ రెండు వారాలు ఎదురు చూసేంత సీన్ ఉండదు. కానీ ఆ టైంలో ప్రమోషన్ చాలా కీలకంగా మారుతుంది. మహర్షి బిజినెస్ డీల్స్ ఇప్పటికే చుక్కలను తాకుతున్నాయని వార్తలు అందుతున్నాయి. అందుకే ఫస్ట్ వీక్ ఎంత వస్తుంది అనేది చాలా కీలకం. హిట్ టాక్ వస్తే ఆపడం కష్టం కాని ఏ మాత్రం డివైడ్ గా మాట వినిపించినా ఇబ్బందులు తప్పకపోవచ్చు.

అంతా సానుకూలంగా కనిపించినా మరొక చిక్కు ఉంది. రాజకీయ పార్టీలు వాటి అనుచరగణం తదితరాలు సినిమాలు చూసే మూడ్ లో ఉండకపోవచ్చు. అది కొంత మేర ప్రభావం చూపిస్తుంది. అయితే పబ్లిసిటీకి మహర్షికి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. తాపీగా ఏప్రిల్ మూడో వారం నుంచి చేసుకోవచ్చు. అప్పటికే ఎన్నికలు పూర్తైపోయి ఉంటాయి కాబట్టి సాఫీగా ఉంటుంది. ప్రస్తుతం బాలన్స్ షూటింగ్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటున్న మహర్షికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ప్రధాన ఆకర్షణ అవుతుందన్న నమ్మకంతో ఉన్నారు ఫ్యాన్స్