Begin typing your search above and press return to search.

మీటూ సాధించింది ఏమిటి ?

By:  Tupaki Desk   |   16 Dec 2018 6:43 AM GMT
మీటూ సాధించింది ఏమిటి ?
X
బాషతో సంబంధం లేకుండా సినిమా పరిశ్రమను కొద్ది రోజుల పాటు కుదిపేసిన మీటూ ఉద్యమం చల్లరిపోయినట్టే. దాని తాలుకు ప్రకంపనలు దాదాపు ఆగిపోయాయి. కొత్తగా బాధితులు ఎవరూ ముందుకు రావడం లేదు. గతం లో ఆరోపణలు చేసిన వాళ్ళు కోర్టు పోలీస్ స్టేషన్ల చుట్టూ ప్రదక్షిణలు చేసుకుంటున్నారు. వీటిలో ఏదైనా తేలుతుందో లేదో ఎవరికీ అంతు చిక్కడం లేదు . దీన్ని మొదలు పెట్టిన తనుశ్రీ దత్తా మొదటి బాధితుడిగా నిలిచిన నానా పటేకర్ ఇంకా లీగల్ వార్ సాగిస్తూనే ఉన్నారు.

ఇక శాండల్ వుడ్ లో సంచలనం రేపిన హీరొయిన్ శృతి హరిహరన్ వ్యవహారం ఇంకా ఓ కొలిక్కి రానే లేదు. యాక్షన్ కింగ్ అర్జున్ తనను ఓ షూటింగ్ లో లైంగికంగా అవాంచనీయమైన ఇబ్బందులకు గురి చేసాడని శ్రుతి పబ్లిక్ గా ఆరోపించడమే కాదు ఏకంగా సై అంటే సై అంటూ ప్రతి సవాళ్ళు కూడా విసిరింది. మరో పక్క అర్జున్ అనవసరంగా తన మీద అభాండాలు వేసి పరువు తీసారని శృతి మీద 5 కోట్లకు దావా వేసారు. ఇది ఇంకా విచారణ స్టేజిలోనే ఉంది. ఇటీవలే హటాత్తుగా కాలం చేసిన సీనియర్ హీరో అంబరీష్ వీళ్ళ మధ్య రాజీ కి తీవ్ర ప్రయత్నాలు చేసి ఆ తర్వాత చేతులెత్తేసారు. ఆయన తర్వాత ఆ బాధ్యత ఎవరు తీసుకునే అవకాశం కూడా కనిపించడం లేదు.

అర్జున్ వాయిదాలు కోరడం తప్ప ఏమి చేయడం లేదని ధరావత్తుగా చెల్లించాల్సిన 50 లక్షలు కట్టకుండా కేవలం తన క్లయింట్ ను బెదిరించడానికే ఇవన్ని చేస్తున్నాడని శృతి తరఫున లాయర్ కొత్త వాదనలు లేవనేత్తుతున్నారు. అసలు ఇది క్లైమాక్స్ కు చేరుకుంటుందా లేదా అనేదే పెద్ద సస్పెన్స్ గా మారింది. డిపాజిట్ చెల్లించకుండా విచారణ చేసేందుకు నిబంధనలు ఒప్పుకోవు. ఒక వేళ అర్జున్ తప్పే చేయకపోతే ధైర్యంగా సొమ్ము కట్టి కోర్టుకు రావొచ్చుగా అనేదే సదరు లాయర్ లాజిక్. ఏదైతేనేం మీటూ మంటలు పైకి చల్లారినట్టు కనిపిస్తున్నా ఇంకా సెగలు తాకల్సిన వాళ్ళకు నొప్పి కలిగిస్తూనే ఉన్నాయి