Begin typing your search above and press return to search.
క్రేజీ డైరెక్టర్ కు టాలీవుడ్ లో నో ఎంట్రీ బోర్డ్స్?
By: Tupaki Desk | 8 Dec 2022 9:30 AM GMTటాలీవుడ్ లో ఎవరు ఎప్పుడు అందలం ఎక్కుతారో.. ఎవరు ఎప్పుడు అథఃపాతాళానికి జారీపోతారో చెప్పడం కష్టం. ప్రతీ శుక్రవారం జాతకాలు మారిపోయే ఇండస్ట్రీ ఇది. రాత్రికి రాత్రే ఇక్కడ స్టార్స్ గా వెలిగిన వాళ్లు వున్నారు.. అతే స్టార్ డమ్ పోవడంతో కనుమరుగైన వాళ్లూ వున్నారు. కారణం ఇక్కడ సక్సెస్ కె విలువ ఎక్కువ. సక్సెస్ లేక పోతే ఇక్కడ ఎవరు.. ఎవరినీ పట్టించుకోరు. బ్లాక్ బస్టర్ సినిమా పడిందా?.. ఇండస్ట్రీ మొత్తం వెంటపడుతుంది.
ఆ తరువాత భారీ డిజాస్టర్ ఇచ్చావో అంతే సంగతులు.. పలకరించే నాథుడే వుండడు ఇక్కడ. ఇప్పడు ఇలాంటి అనుభవాన్నే ఓ యంగ్ డైరెక్టర్ ఎదుర్కొంటున్నాడా?.. తనకు సినిమా చేయాలనుకున్నా వాళ్లే ఇప్పడు ముఖం చాటేస్తున్నారా? .. ఏకంగా తనకు టాలీవుడ్ లో నో ఎంట్రీ బోర్డ్స్ పెట్టేస్తున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. అవకాశం ఇస్తా అన్న వాళ్లు కూడా సదరు దర్శకుడిని పట్టించుకోవడం లేదని తెలుస్తోంది.
గత ఏడాది పేరులేని వాళ్లతో చేసిన కామెడీ మూవీ వరల్డ్ వైడ్ గా సంచలనాలు సృష్టించింది. కేవలం 4 కోట్లతో నిర్మించిన ఆ మూవీ ప్రపంచ వ్యాప్తంగా రికార్డు స్థాయిలో దాదాపు రూ.75 కోట్ల వరకు రాబట్టి ట్రేడ్ పండితుల్నే విస్మయానికి గురిచేసింది.
ఈ మూవీతో టాలీవుడ్ లో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచిన దర్శకుడితో సినిమాలు చేయాలని క్రేజీ స్టార్స్ అనుకున్నారు. తనకు అడ్వాన్స్ లు కూడా ఇప్పించారట. అయితే బ్లాక్ బస్టర్ హిట్ తరువాత సదరు దర్శకుడు తమిళ హీరోతో అదే ఫార్ములతో ఓ మూవీని తెరకెక్కించాడు.
రీసెంట్ గానే ఈ మూవీ తమిళ, తెలుగు భాషల్లో భారీ స్థాయిలోనే విడుదలైంది. అయితే క్రేజీ హీరోతో , పేరున్న మేకర్స్ నిర్మించిన సినిమా అయినా సరే కంటెంట్ లేకపసోవడం.. దర్శకుడు చేసిన ప్రీవియస్ మూవీ తరహా కామెడీ సీన్ లతో నింపేయడంతో ఆడియన్స్ ని పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో బాక్సాఫీస్ వద్ద తమిళ, తెలుగు భాషల్లో ఫ్లాప్ అనిపించుకుంది.
దీంతో ఒక్క సినిమాతో భారీ క్రేజ్ ని సొంతం దర్శకుడు ఉన్నపలంగా పాతాళానికి పడిపోయాడు. తనతో సినిమా చేయాలనుకున్న క్రేజీ స్టార్ కూడా ముఖం చాటేస్తున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.