Begin typing your search above and press return to search.
పవన్ వర్సెస్ మహేష్.. పోటీ లేదట
By: Tupaki Desk | 27 Sep 2017 4:03 AM GMTటాలీవుడ్ లో స్టార్స్ మధ్య వ్యక్తిగతంగా మంచి స్నేహబంధాలు ఉన్నా తెరపై కి వచ్చే సరికి మాత్రం తీవ్ర స్థాయిలో పోటీకి దిగుతుంటారు. పోటీ మంచిదే.. ఆ ఫొటి ఉంటే కూడా ఓ విధంగా హీరోల స్థాయి కూడా పెరుగుతుంది. కానీ సినిమాల గురించి ఆలోచించి కొంతమంది హీరోలు రిస్క్ చేయడానికి ఇష్టపడరు. ఇక వచ్చే సంక్రాంతి కి కోడిపందెల కంటే స్టార్ హీరోల పోటీ ఏ స్థాయిలో ఉంటుందో తెలిసిన విషయమే. ఇక కుర్ర హీరోలు కూడా పోటీకి దిగి అదృష్టాన్ని పరక్షించుకొని ఒక్కోసారి జాక్ పాట్ లాంటి హిట్ కొట్టేస్తారు.
ఇక టాలీవుడ్ లో అందరూ హీరోలు ఓటమి రుచి చూసిన వాళ్లే. కానీ కొందరు మాత్రం ఒటమిని తట్టుకోలేరు అందులో మహేష్ బాబు ఒకరు. ఓటములు ఆయనకు అనుభవమే అయినా మరో ప్రయోగం తో విజయం వస్తుందో లేదో అనే కోణంలో సినిమా చేయడానికి ఇష్టపడరు. ఇక రిలీజ్ విషయంలో అయితే చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. 2015 లో ప్రిన్స్ చిత్రం శ్రీమంతుడు - బాహుబలి మొదటి పార్ట్ సమయంలో రిలీజ్ కావాల్సింది. కానీ రిస్క్ ఎందుకని నెల తర్వాత రిలీజ్ చేశారు. ఓ విధంగా బాహుబలి కి కూడా ఆ విధానం హెల్ప్ అయ్యింది.అయితే ఇప్పుడు మహేష్ - పవన్ కళ్యాణ్ సినిమాలు సంక్రాంతి బరిలో పోటీ పడనున్నాయని టాక్ వినిపిస్తోంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పవన్ 25వ సినిమా జనవరి 10న రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకుంది. అయితే మహేష్ - కొరటాల కాంబో లో వస్తున్న భరత్ అనే నేను సినిమా కూడా అదే నెలలో రిలీజ్ కాబోతున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే అది నిజం కాదని తెలుస్తోంది. ఎందుకంటే స్పైడర్ వల్ల ఆ సినిమా షూటింగ్ ఇప్పటికే ఆలస్యం అయ్యింది.
దీంతో సినిమా ఫిబ్రవరి వరకు షూటింగ్ పనుల్లో ఉంటుంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా చాలా ఆలస్యం అవుతాయి. అందులోను భారీ తారాగణం తో కూడుకున్న భారీ బడ్జెట్ సినిమా. అన్ని అనుకున్నట్టు జరిగినా సినిమా రిలీజ్ చేసేందుకు టైమ్ పడుతుంది. అంటే మహేష్ భారత్ అనే నేను మార్చ్ నెలలో రావడం ఖాయంగా కనిపిస్తోంది. సమ్మర్ లో ఎక్కువగా పెద్ద సినిమా తాకిడి కూడా ఉండదు. ఇక రజినీకాంత్ 2.0 జనవరిలో లాస్ట్ వీక్ లో రిలీజ్ కానుంది. ఫిబ్రవరి మొత్తం ఆ సినిమా ఆడినా మహేష్ మాత్రం హ్యాపీగా సమ్మర్ లో కూల్ గా వెళ్లిపోవచ్చు అనేలా ప్లాన్స్ చేసుకున్నట్టు తెలుస్తోంది.