Begin typing your search above and press return to search.

క్ష‌త్రియుల‌కు పిల్ల దొర‌క‌డం లేద‌ట‌!

By:  Tupaki Desk   |   27 Dec 2019 12:19 PM GMT
క్ష‌త్రియుల‌కు పిల్ల దొర‌క‌డం లేద‌ట‌!
X
రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ పెళ్లెప్పుడు? గ‌త నాలుగేళ్లుగా ట్రెండింగ్ టాపిక్ ఇది. డార్లింగ్ పెళ్లి నేడో రేపో అంటూ సోష‌ల్ మీడియాలో వ‌చ్చిన పుకార్ల గురించి తెలిసిందే. ఇప్ప‌టికే వంద‌లాది క‌థ‌నాలు వెలువ‌డ్డాయి. ఫ‌లానా హీరోయిన్ ని పెళ్లాడుతున్నాడ‌ని.. భీమ‌వ‌రం పిల్లతో పెళ్లి కుదిరింద‌ని ఎన్నో క‌థ‌నాలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి. వీటిని ప్ర‌భాస్ స‌హా రెబ‌ల్ స్టార్ ఫ్యామిలీ ఖండించ‌డం తెలిసిందే. ఒకానొక స‌మ‌యంలో అబ్బాయి పెళ్లిపై పెద‌నాన్న కృష్ణం రాజు కొంత ఆవేద‌న‌తో కూడుకున్న‌ అస‌హనం వ్య‌క్తం చేసారు. తాను ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడో త‌న‌కే తెలియాలేద‌ని అనేసారు. న‌ల‌భైకి ద‌గ్గ‌ర‌గా ఉన్నా డార్లింగ్ పెళ్లి చేసుకోడు ఎందుకో ఇలా.. అంటూ అభిమానులు సైతం వెయిటింగ్ చేయ‌క త‌ప్ప‌లేదు.

బాహుబ‌లి కోసం ఐదేళ్లు.. ఆ త‌ర్వాత‌ సాహో కోసం రెండేళ్లు అయిపోయాయి. వ‌చ్చే ఏడాది జాన్ కూడా వచ్చేస్తుంది. జాన్ అంత‌కంత‌కు ఆల‌స్య‌మ‌వుతుంటే.. ఓ ర‌కంగా స‌స్పెన్స్ కొన‌సాగుతోంది. ఈ నేప‌థ్యంలో తాజాగా ప్ర‌భాస్ పెళ్లిపై ప‌రిమితంగా మాత్ర‌మే స్పందించే కృష్ణంరాజు స‌తీమ‌ణి.. ప్ర‌భాస్ పెద్ద‌మ్మ శ్రీ‌మ‌తి శ్యామ‌ల ఓ ఇంటర్వూలో ఆస‌క్తిక‌ర విష‌యాలు చెప్పుకొచ్చారు. ప్ర‌భాస్ పెళ్లి కోసం ఎంతో ఆతృత‌గా ఎదురు చూస్తున్నాం. అలాగే అబ్బాయి పెళ్లి గురించి సోష‌ల్ మీడియాలో వ‌స్తోన్న‌ వార్త‌లు చూసి న‌వ్వుకుంటున్నాం అన్నారు.

ప్ర‌భాస్ కి ఎలాంటి అమ్మాయి కావాలో త‌న‌కు బాగా తెలుసున‌ని.. త‌మ‌ది చాలా పెద్ద కుటుంబం అని ..అలాంటి కుటుంబంలో క‌లిసిపోయే అమ్మాయి కోసం చూస్తున్నామ‌ని...అన్నీ అనుకున్న‌ట్లు గ‌నుక జ‌రిగితే జాన్ త‌ర్వాత ప్ర‌భాస్ పెళ్లికి ముహూర్తాలు పెట్టేస్తామ‌ని శ్యామ‌ల తెలిపారు. ఇక ప్ర‌భాస్ క్ష‌త్రియ వంశ‌స్తుడు. ఆ వంశంలో అమ్మాయిలు త‌క్కువ‌గా ఉండ‌టం ఓ స‌మ‌స్య‌గా మారింద‌ని ఆ వంశ‌స్తుల నుంచి వినిపిస్తోంది. స‌హ‌జంగా క్ష‌త్రియ వంశంలో జ‌న్మించిన అబ్బాయిల‌కు ఇలాంటి స‌మ‌స్య స‌హ‌జంగా త‌లెత్తుతోంద‌ని అంటున్నారు. పైగా ప్ర‌భాస్ పెద్దింటి కుర్రాడు. పెద్ద స్టార్. కోట్లాధిప‌తి. త‌న తాహ‌తుకు త‌గ్గ అమ్మాయి దొర‌కాలంటే ఆ మాత్రం వెయిట్ చేయ‌క త‌ప్ప‌దని అంటున్నారు.