Begin typing your search above and press return to search.

మార్చి ఎందుకో క‌లిసి రాలేదు!

By:  Tupaki Desk   |   4 March 2019 4:44 AM GMT
మార్చి ఎందుకో క‌లిసి రాలేదు!
X
ప‌రీక్ష‌ల సీజ‌న్.. పైగా ఎండ‌లు మండే సీజ‌న్ కావ‌డంతో సినిమాల‌ జోరు త‌గ్గింది. ప్రారంభోత్స‌వాలు.. సినిమాల రిలీజ్ లు అంతంత మాత్రంగానే ఉన్నాయి. రామానాయుడు స్టూడియోస్.. అన్న పూర్ణ స్టూడియోస్.. సార‌థి స్టూడియోస్ స‌హా ప‌లు స్టూడియోలు ఇప్ప‌టికే మూగ‌నోము పాటిస్తున్నాయి. ఓపెనింగుల సంద‌డి లేనే లేదు.. ఇక సినిమాల‌ రిలీజ్ ల సంద‌డి అస‌లే లేదు. అడ‌పా ద‌డ‌పా శుక్ర‌వారాలు ఏవో సినిమాలు వ‌చ్చి వెళుతున్నాయి త‌ప్ప వీటి గురించి ప‌ట్టించుకునే ప‌రిస్థితే లేదు. పైపెచ్చు జ‌నాల్లో క్యూరియాసిటీ పెంచే సినిమాలేవీ ద‌రిదాపుల్లో లేనే లేవు.

ఇటీవ‌లే క‌ళ్యాణ్ రామ్ 118 రిలీజై మిశ్ర‌మ స్పంద‌న‌లు అందుకుంది. ఈ సినిమా ఓపెనింగ్స్ బావున్నాయ‌న్న టాక్ వినిపించింది. అయితే విద్యార్థులంతా ప‌రీక్ష‌ల టెన్ష‌న్ లో ఉంటారు కాబ‌ట్టి లాంగ్ ర‌న్ లో ఎలా ఉంటుంది? అన్న‌ది చెప్ప‌లేని ప‌రిస్థితి. మ‌రోవైపు ఎండల తీవ్ర‌త అంత‌కంత‌కు పెరుగుతోంది కాబ‌ట్టి జ‌నం థియేట‌ర్ల కు వ‌చ్చేందుకు సాహ‌సించే ప‌రిస్థితి లేదు. ఈ స‌న్నివేశంలో ఐదారు సినిమాలు రిలీజ్ ల‌కు వ‌స్తున్నా .. వీటిని ప‌ట్టించుకునే స‌న్నివేశం లేనేలేక‌పోవ‌డంపై ఆస‌క్తిగా ముచ్చ‌టించుకుంటున్నారు. ఉన్నవాళ్ల‌లో కాస్తంత‌ ఆర్జీవీ సంద‌డే ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అత‌డు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన `ల‌క్ష్మీస్ ఎన్టీఆర్` ప్ర‌చారార్భాటం జ‌నాల్లో కొంత హైప్ తెచ్చింది. ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైల‌ర్ అంద‌రికీ న‌చ్చింది. అయితే ట్రైల‌ర్ న‌చ్చిన‌వాళ్లు అంతా థియేట‌ర్ల‌కు వ‌స్తారా? అన్న‌ది చూడాలి. ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ రిలీజ్ తేదీ మార్చి 22 అని ప్ర‌క‌టించారు. అయితే ఓవైపు ఏపీలో ఎన్నిక‌ల వేడి రాజుకుంటున్న వేళ‌.. కోడ్ వ‌స్తే ఆ సినిమా ప‌రిస్థితేంటి? అంటూ మాట్లాడుకుంట‌న్నారు.

ఇక ఆర్జీవీ సినిమాతో పోటీప‌డుతూ ఓ రెండు మూడు చిత్రాలు రిలీజ‌వుతున్నాయి. వీటిలో అల్లు శిరీష్ హీరోగా న‌టిస్తున్న మ‌ల‌యాళ రీమేక్ `ఏబీసీడీ` మార్చి 21న రిలీజ‌వుతోంది. ఈ సినిమా ప్రీరిలీజ్ బిజినెస్ గురించి వాస్త‌విక స‌మాచారం లేదు. మార్చి 21న‌ నందిత శ్వేత - సుమంత్ అశ్విన్ జంట‌గా న‌టించిన `ప్రేమ‌క‌థా చిత్రం`, జ‌య‌ప్ర‌ద - సాక్షి చౌద‌రి- పూర్ణ ప్ర‌ధాన తారాగ‌ణంగా న‌టించిన `సువ‌ర్ణ సుంద‌రి` విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్నాయి. అయితే వీట‌న్నిటిలో `ల‌క్ష్మీస్ ఎన్టీఆర్` చిత్రం విష‌యంలో ప్ర‌చారం ప‌రంగా హైప్ క‌నిపించింది. ఏబీసీడీ, సువ‌ర్ణ‌సుంద‌రి, ప్రేమ‌క‌థా చిత్రం ప్రాచరం ఇప్ప‌టికి సోసోనే.

అస‌లే ప‌రీక్ష‌ల సీజ‌న్.. పైగా ఎండ‌ల మంట‌లు.. ఈ టైమ్ లో రిలీజ్‌ సినిమాల ప‌రిస్థితేంటో? అంటూ ప్ర‌స్తుతం ఫిలింన‌గ‌ర్ లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. ఈ సినిమాల ప్రీరిలీజ్ బిజినెస్ గురించి ఏమంత మాటా మంతీ సాగ‌డం లేదు. ఈ సినిమాల రిలీజ్ ల త‌ర్వాత కూడా పెద్ద సినిమాల‌ రిలీజ్ లు లేవు. అయినా ఎందుక‌నో హైప్ మాత్రం లేదు. మార్చి 8న రాయ్ ల‌క్ష్మీ న‌టించిన `వేర్ ఈజ్ వెంక‌ట‌ల‌క్ష్మి` రిలీజ‌వుతోంది. ఇక మార్చి త‌ర్వాత‌ ఏప్రిల్- మే సినిమాల‌కు మ‌రింత గ‌డ్డుకాలం అన్న ముచ్చ‌టా సాగుతోంది.