Begin typing your search above and press return to search.

పాపం రెంటికి చెడ్డ రేవడయ్యాడు

By:  Tupaki Desk   |   17 Feb 2019 12:10 PM GMT
పాపం రెంటికి చెడ్డ రేవడయ్యాడు
X
గత ఏడాది డిసెంబర్ దాకా క్రిష్ ఓ అరుదైన ఘనత సాధించబోతున్నాడనే సంబరం సినిమా ప్రేమికుల్లో బలంగా ఉండింది. ఒక వైపు ఎన్టీఆర్ రెండు భాగాలూ మరో వైపు మణికర్ణిక మొత్తం మూడు ప్రతిష్టాత్మక సినిమాలు కేవలం యాభై రోజుల వ్యవధిలో విడుదలవుతున్న అరుదైన రికార్డు తన ఖాతాలో వచ్చి పడుతుందని ఆశపడ్డారు. గత కొన్నేళ్లలో ఏ దర్శకుడికి ఈ ఛాన్స్ దక్కలేదు. అయితే ఇవి హిట్ అయితేనే ఇలాంటివి గర్వంగా చెప్పుకునే అవకాశం కలుగుతుంది. కానీ జరిగింది వేరు.

ఎన్టీఆర్ కథానాయకుడు ఆల్ టైం డిజాస్టర్స్ లో థర్డ్ ప్లేస్ తీసుకుంది. మణికర్ణిక వివాదాల పుణ్యమా అని ఎంతో కొంత రాబట్టుకుంది కానీ వంద కోట్లు వస్తేనే సేఫ్ అయ్యే టార్గెట్ ను చేరుకోలేక నత్తనడక సాగిస్తోంది. ఇదీ హిట్ అని చెప్పలేని పరిస్థితి. మహానాయకుడు మీద ఆశించిన బజ్ లేదు. బాలయ్య కొత్త సినిమా వస్తోందన్న స్పృహ కానీ ఉత్సాహం కానీ అభిమానుల్లోనే కనిపించడం లేదు. క్రిష్ మీద ఈ ఒత్తిడీ ఉంది.

అనుకున్నది ఒకటి అయ్యిందొక్కటి తరహాలో క్రిష్ మొత్తంగా బ్యాడ్ టైం ని ఎదురుకుంటున్నాడు. నిన్న విడుదలైన మహానాయకుడు ట్రైలర్ కు భీభత్సమైన రెస్పాన్స్ ఏమి రాలేదు. పైగా అతిశయోక్తి భజన ఎక్కువ చేశారన్న కామెంట్స్ వచ్చి పడ్డాయి. ఇక ఇప్పుడు రిలీజ్ కోసం వెయిట్ చేయడం తప్ప చేయగలిగింది ఏమి లేదు. ఇది బ్లాక్ అస్తెర్ అయితే క్రిష్ కు కొంత ఊరట దక్కుతుంది లేదంటే ఇబ్బందులు తప్పవు.

డిసెంబర్ లో నిర్మాతగా అంతరిక్షం రూపంలో ఆల్రెడీ షాక్ తిన్న క్రిష్ కు ఇవన్నీ కఠిన సవాళ్ళను విసురుతున్నాయి. అసలు నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎవరితో ఉండొచ్చన్న కనీస అంచనా కూడా ప్రస్తుతానికి లేదు. 22 తర్వాత క్రిష్ కాస్త బయటికి వచ్చి కొత్త సినిమా విశేషాలు ఏమైనా చెబుతాడేమో చూడాలి