Begin typing your search above and press return to search.

ఫిలించాంబ‌ర్ ఎల‌క్ష‌న్స్ చ‌డీ చ‌ప్పుడు లేదే

By:  Tupaki Desk   |   25 July 2019 6:46 AM GMT
ఫిలించాంబ‌ర్ ఎల‌క్ష‌న్స్ చ‌డీ చ‌ప్పుడు లేదే
X
ఎల‌క్ష‌న్ అంటే బోలెడంత హ‌డావుడి నెల‌కొంటుంది. ఇటీవ‌ల టాలీవుడ్ లో మూవీ ఆర్టిస్టుల సంఘం (మా) ఎల‌క్ష‌న్స్ హ‌డావుడి తెలిసిందే. ర‌క‌ర‌కాల వివాదాల న‌డుమ ఈ ఎన్నిక‌లు పూర్త‌య్యాయి. ఆ త‌ర్వాత టాలీవుడ్ కి అత్యంత కీల‌క‌మైన నిర్మాత‌ల మండ‌లి ఎన్నిక‌ల్ని సైలెంటుగానే పూర్తి చేశారు. కీల‌క‌మైన నిర్మాత‌ల గిల్డ్ (ఎల్ ఎల్ పి బ్యాచ్) ఈ ఎన్నిక‌ల‌కు దూరంగా ఉండ‌డంతో సీనియ‌ర్ అయిన‌ సి.క‌ళ్యాణ్ ని అధ్య‌క్షుడిగా ఎన్నుకున్నారు. మండ‌లి ఎన్నిక‌ల్లో కొంద‌రిని యునానిమ‌స్ గానే ఎంపిక చేశారు. అప్ప‌ట్లో అస‌లైన సినీపెద్ద‌లెవ‌రూ లేక‌పోవ‌డంతో అంత హ‌డావుడి కూడా ఏం జ‌ర‌గ‌లేదు.

ఈసారి ఫిలించాంబ‌ర్ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. చాంబ‌ర్ లో నాలుగు సెక్టార్ల ఎన్నిక‌లు ఇవి. 2019-21 సీజన్ కు తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి (ఫిలింఛాంబర్) కార్యవర్గ సభ్యులు- మండలి నాలుగు విభాగాల (సెక్టర్లు) సభ్యుల ఎన్నికల్ని ఈనెల 27న నిర్వ‌హిస్తున్నారు. ఆ మేరకు జూన్ 27న జరిగిన కార్యవర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. జూలై 27న సర్వసభ్య సమావేశం (జనరల్ బాడీ మీటింగ్) సహా అదే రోజు హైదరాబాద్ లో ఎన్నికలు నిర్వహిస్తున్నామని ఫిలింఛాంబర్ వర్గాలు ఇదివ‌ర‌కూ వెల్ల‌డించాయి. అయితే ఈ ఎన్నిక‌ల‌పై మీడియాలో స‌రైన హ‌డావుడి అన్న‌దే లేదు.

ఎగ్జిబిట‌ర్ - డిస్ట్రిబ్యూట‌ర్- స్టూడియో ఓన‌ర్స్- నిర్మాత‌ల నుంచి ఒక ఈసీ క‌మిటీని దానిని లీడ్ చేసేవాళ్ల‌ను ఎన్నుకోవాల్సి ఉంటుంది. ఈ ఎన్నిక‌ల్లోనూ మ‌న ప్యానెల్ పోటీ చేస్తోంది. ఈ ప్యానెల్ త‌ర‌పున‌ వైవియ‌స్ చౌద‌రి..ప‌ల్లి కేశ‌వ‌రావు.. టి.ప్ర‌స‌న్న‌కుమార్.. మోహ‌న్ వ‌డ్ల‌ప‌ట్ట‌.. న‌ట్టికుమార్ .. రామ‌స‌త్య‌నారాయ‌ణ‌ త‌దిత‌రులు పోటీ చేస్తున్నారు. ఇక ప్ర‌త్య‌ర్థి ప్యానెల్ వివ‌రాలు తెలియాల్సి ఉంది. జూలై 27న ఉద‌యం 8 గంట‌ల‌కు పోలింగ్ మొద‌ల‌వుతుంది. ఒంటిగంట‌కు పూర్త‌వుతుంది. అదే రోజు రాత్రి రిజ‌ల్ట్ ని కూడా వెల్ల‌డిస్తారు. ఇక ఫిలింఛాంబ‌ర్ ఎల‌క్ష‌న్స్ అంటే ఎంతో కీల‌క‌మైన‌వి. టాలీవుడ్ లో ప్ర‌తియేటా 200 సినిమాలొస్తున్నాయి. వీటిలో ఆ న‌లుగురు లేదా 10-15 మంది నిర్మాత‌లు మాత్ర‌మే సాలిడ్ గా రెగ్యుల‌ర్ గా సినిమాలు చేస్తున్నారు. కానీ వంద‌ల మంది కొత్త నిర్మాత‌లు వ‌స్తున్నారు. వీళ్ల‌ను గైడ్ చేసేది సీనియ‌ర్లే. అయితే చాంబ‌ర్ -నిర్మాత‌ల మండ‌లిలో సినిమాలు తీయ‌ని నిర్మాత‌ల హ‌డావుడే ఎక్కువైంద‌న్న విమ‌ర్శ‌లు ఇటీవ‌ల ర‌చ్చ‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే.