Begin typing your search above and press return to search.
బాలయ్య సినిమాకా ఈ పరిస్థితి!
By: Tupaki Desk | 16 Feb 2019 4:56 AM GMTబహుశా నాన్న ఎన్టీఆర్ కథను సినిమాగా తెరకెక్కించాలని బాలకృష్ణకు ఏ ముహూర్తంలో అనిపించిందో కాని ఇప్పుడా టైంని గుర్తుచేసుకుని మరీ తనను తాను నిందించుకుంటూ ఉంటాడు. బాక్స్ ఆఫీస్ కలెక్షన్లలో చరిత్ర సృష్టిస్తుంది అనుకుంటే డిజాస్టర్స్ లో కొత్త రికార్డు సెట్ చేసిన ఎన్టీఆర్ కథానాయకుడు ప్రభావం ఊహించిన దాని కన్నా ఎక్కువే మహానాయకుడు మీద పడుతోంది. ఇంకో ఆరు రోజుల్లో విడుదల అవుతుందన్న సందడి మచ్చుకు కూడా కనిపించడం లేదు. నిన్న కొత్త పోస్టర్లేవో విడుదల చేసారు. ఇవాళ మరో ట్రైలర్ రాబోతోంది. ఈ రెండు హైప్ ని అమాంతం రెట్టింపు చేసేంత సీన్ అయితే ఉండకపోవచ్చు.
దానికి తోడు చాలా డ్రై గా చెప్పుకునే ఫిబ్రవరి ఆఖరులో ఇది రావడం కూడా కొంత మైనస్సే. జనాలు సినిమా చూసే మూడ్ లో లేరని తెలుస్తోంది. పాజిటివ్ టాక్ వచ్చిన యాత్ర కూడా నెమ్మదించింది. ఈ నేపథ్యంలో మహానాయకుడు అద్భుతాలు చేస్తే తప్ప గట్టెక్కడం కష్టం. కథానాయకుడు నష్టాలకు ఊరటగా బాలయ్య క్యాంపు ఇచ్చిన 33-40 ఫార్ములా బయ్యర్లను ఆకర్షించింది. రిస్క్ లేని వ్యవహారం కాబట్టి రిలీజుకయ్యే ఖర్చులను పెట్టుకుని తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధ పడ్డారు.
అయితే మహానాయకుడు పూర్తిగా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ సినిమా కావడం మాస్ ఆడియన్స్ ని అంతగా ఆకర్షించకపోవచ్చు. మొదటి భాగం లాగా ఇందులో స్టార్ హీరోయిన్ల క్యామియోలు మెరుపులు ఏమి ఉండవు. సినిమా క్లైమాక్స్ దాకా విద్యా బాలనే ఉంటుంది. పాటలకు అవకాశమే లేదు. సో ఇలాంటి ఆకర్షణలు లేకుండా మహానాయకుడు బరిలో దిగుతుండటంతో హైప్ ఆశించిన స్థాయిలో లేదు. బాలయ్య కెరీర్లోనే ఇంత లో బజ్ తో వస్తున్న మూవీ ఇదేనని అభిమానులే అనుకోవడం గమనార్హం