Begin typing your search above and press return to search.
కళ్యాణ్ రామ్ తో విభేదాల్లేవు-సురేందర్
By: Tupaki Desk | 11 Dec 2016 6:38 AM GMTసురేందర్ రెడ్డికి దర్శకుడిగా అవకాశమిచ్చింది నందమూరి కళ్యాణ్ రామ్. వీళ్లిద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘అతనొక్కడే’ సూపర్ హిట్. దెబ్బకు స్టార్ డైరెక్టర్ అయిపోయాడు సురేందర్. ఐతే దీని తర్వాత కళ్యాణ్ రామ్ నిర్మాణంలో సురేందర్ రెడ్డి తీసిన ‘కిక్-2’ డిజాస్టర్ అయింది. ఐతే ఆ సినిమాకు సురేందర్ అనవసరంగా బడ్జెట్ పెంచేశాడని.. షూటింగ్ సందర్భంగా కళ్యాణ్ రామ్ కు.. అతడికి తీవ్ర విభేదాలు తలెత్తాయని రకరకాల ప్రచారాలు జరిగాయి.
దీని గురించి ఒక ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చాడు సురేందర్. ‘‘కళ్యాణ్ రామ్ గారితో నాకు ఎలాంటి విభేదాల్లేవు. మా గురించి జరుగుతున్నదంతా ఉత్త ప్రచారమే. హిట్లు ఫ్లాపులు అన్నవి సహజం. వాటి వల్ల రిలేషన్స్ దెబ్బ తినవు. మేమిద్దరం హాయిగా మాట్లాడుకుంటున్నాం. ముందులాగే ఉంటున్నాం’’ అని సురేందర్ తెలిపాడు. కిక్-2 ఫ్లాపవడానికి రకరకాల కారణాలున్నాయని సురేందర్ అభిప్రాయపడ్డాడు.
ఒక హిట్ తర్వాత ఒక ఫ్లాప్ అన్నట్లు తన కెరీర్ సాగిపోతుండటంపై సురేందర్ స్పందిస్తూ.. ‘‘నేను ఎప్పుడూ ఒకే జానర్లో సినిమాలు తీయలేదు. ఒక సినిమాకు ఇంకో సినిమాకు సంబంధం లేకుండా సినిమాలు చేస్తున్నా. ఒకే తరహాలో కంఫర్ట్ జోన్లో సినిమాలు తీసుకుంటూ పోతే హిట్లే వస్తాయేమో. కానీ సినిమా సినిమాకు కొత్తగా ప్రయత్నం చేస్తున్నా. అందుకే నాకు ఫ్లాపులు కూడా వస్తున్నాయి. అయినా ఇదే దారిలో ప్రయాణం చేస్తా’’ అని స్పష్టం చేశాడు.