Begin typing your search above and press return to search.
లీకైన పాటకు మహేష్ కు లింకే లేదు
By: Tupaki Desk | 27 March 2017 2:53 PM ISTసూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పుడు వియత్నాంలో ఉన్నాడు. అక్కడే మురుగుదాస్ డైరక్షన్లో తమ కొత్త సినిమా కోసం యాక్షన్ సన్నివేశాల్లో పాల్గొంటున్నాడు. ఈ సినిమా షూటింగులో ఒక ప్రక్కన మహేష్ బిజీగా ఉంటే.. మరో ప్రక్కన అభిమానులు మాత్రం అయ్యో అంటూ ఫీలైపోతున్నారు. అయితే ఇప్పుడు ఒక క్లారిఫికేషన్ వారికి కాస్త ఆనందాన్ని ఇచ్చింది.
ఈ సినిమాకు తమిళ కంపోజర్ హారిస్ జయరాజ్ మ్యూజిక్ అందిస్తున్న సంగతి తెలిసిందే. ఆయన కంపోజ్ చేసిన ఒక పాట లీకైందని టాక్ వచ్చేసింది. ఏకంగా ఒక పాట మొత్తం వచ్చేసిందంటూ రూమర్లు రాగా.. ఆ పాట సూపరుంది అంటూ కొందరు రివ్యూలు కూడా రాసేశారు. అబ్బే బాలేదు అంటూ కొందరు కామెంట్లు కూడా చేసేశారు. కాని విశేషం ఏంటంటే.. అసలు లీకైన ఆ పాటకూ మహేష్ బాబు సినిమాకూ ఎటువంటి లింకే లేదు.
ఎవరో కంపోజ్ చేసిన ఒక ఇండిపెండెంట్ వీడియో తాలూకు మ్యూజిక్ ఒకటి ఇలా రిలీజైందట. దానిని కొందరు ఆకతాయిలు ఇది మహేష్ బాబు సినిమాలో ఓపెనింగ్ సాంగ్.. క్లోజింగ్ సాంగ్.. అంటూ రచ్చ చేయడం మొదలెట్టారు. కాకపోతే ఆ పాటకూ మహేష్ సినిమాకు సంబంధమే లేదు అనే విషయం మాత్రం కాస్త లేటుగా బయటపడింది. అది సంగతి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/