Begin typing your search above and press return to search.
మేముసైతంలో మెగాలు లేరెందుకో!?
By: Tupaki Desk | 30 March 2016 5:19 AM GMTమంచు మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మి హోస్ట్ గా మేము సైతం అనే ఓ సామాజిక కోణం ఉన్న టీవీ షోని నిర్వహిస్తోంది. సెలబ్రిటీలను, దిగ్గజాలను సామాన్యులుగా మార్చేసి.. వారి ద్వారా నిధులు సేకరించి.. ఆపన్నులకు అందించాలన్నది ఈ టీవీ షో కాన్సెప్ట్. మొత్తం 13 వారాలు ప్రసారం కానున్న ఈ మేముసైతం ను.. జెమినీ టీవీలో ప్రసారం చేయనున్నారు.
ఇప్పుడీ షోకి సంబంధించిన ఎపిసోడ్స్ పిక్చరైజేషన్ దాదాపు పూర్తి కావస్తుండడంతో... కార్యక్రమంలో భాగమైన అందరితో కలిసి ఓ పోస్టర్ వేశారు. మంచు మోహన్ బాబు, అక్కినేని నాగార్జున, మాస్ మహరాజా రవితేజ, నేచురల్ స్టార్ నాని, అరుంధతి అనుష్క, టాలీవుడ్ చందమామ కాజల్, అక్కినేని అఖిల్, మంచు మనోజ్, తమన్నా, శ్రియ, రకుల్ ప్రీత్ సింగ్, రాణా.. ఇలా అందరితో కనూ కలిపి ఓ పెద్ద పోస్టర్ వేసి... దాని ముందు మంచు లక్ష్మి నుంచున్న పోస్టర్ ఆకట్టుకుంటోంది.
అయితే.. ఈ మొత్తం మేముసైతం టీంలో మెగా ఫ్యామిలీకి చెందిన హీరోలు ఎవరూ లేకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయం. సోషల్ యాక్టివిటీస్ లో పాల్గొనడంలో... స్వచ్ఛందంగా ముందుకొచ్చి సహాయం చేయడంలో మెగా క్యాంప్ లో చాలామందికి మంచి పేరుంది. ఇలా కార్యక్రమాల కోసం కాకుండా.. తమంతట తామే వెళ్లి అదుకునే తత్వం ఉన్నవారు కూడా ఉన్నారు. మరి అలాంటి వారిలో ఒక్కరిని కూడా ఎంచుకోకుండా.. వీరితోనే సరిపెట్టేయడం కొంత నిరుత్సాహం కలిగించే విషయమే.