Begin typing your search above and press return to search.
రాధేశ్యామ్ పై జాతీయ మీడియా ఏమంటోంది?
By: Tupaki Desk | 11 March 2022 5:56 PM GMTబాహుబలి - కేజీఎఫ్ తర్వాత పుష్ప చిత్రం సౌత్ నుంచి వెళ్లి బాలీవుడ్ లో బంపర్ హిట్ కొట్టింది. దేశవ్యాప్తంగా ఈ చిత్రం గురించిన ఆసక్తికర చర్చ సాగింది. కరోనా క్రైసిస్ లోనూ పెద్ద హిట్టయ్యింది. ఆ తర్వాత వచ్చిన సినిమాగా రాధేశ్యామ్ గురించి జాతీయ మీడియాలో ఎలాంటి ప్రచారం సాగుతోంది? అక్కడ సమీక్షలు ఎలా ఉన్నాయి? అన్నది చూస్తే ఆసక్తికర విషయాలున్నాయి.
దేశవ్యాప్తంగా ప్రభాస్ కు భారీ గా అభిమానులు ఉన్నారు. అభిమానులు మొదటి రోజునే రాధే శ్యామ్ ని చూడటానికి ఆసక్తిని కనబరచగా సమీక్షలు చదివేందుకు ఎగబడ్డారు. అయితే జాతీయ మీడియాలు మాత్రం రాధేశ్యామ్ విషయంలో పెదవి విరిచేసాయి.
టైమ్స్ ఆఫ్ ఇండియా సమీక్ష ప్రకారం.. కొన్ని పాటల చిత్రీకరణ చాలా సంవత్సరాల క్రితం చేసిన మంచి సంగీత వీడియోలను మీకు గుర్తు చేస్తుంది. VFX ప్రశంసలకు అర్హమైనది. చిత్రం దృశ్యమానంగా నాణ్యతా ప్రమాణాలను పెంచింది. కానీ ఇవన్నీ ఈ ప్రేమకథను రక్షించలేదు.
రాధేశ్యామ్ విధి నిజంగా వేరే విధంగా ఉండొచ్చు! అంటూ చివర్లో పంచ్ ఇచ్చారు క్రిటిక్. ఎన్డీటీవీ సమీక్ష చూస్తే.. ప్రభాస్ -పూజా హెగ్డే లు యుక్తికి తక్కువ స్పేస్ ఉండేలా స్క్రీన్ ప్లే ను రూపొందించారు. అంతిమ ఫలితం ఫెయిల్యూర్ అని విమర్శించారు. ప్రేమలో పడటం కష్టతరమైన ప్రేమకథ అని సమీక్షించారు.
దెయ్యం ఉంటే... అతను ఈ చిత్రంలో ప్రతిచోటా ఉంటాడు.. ఇది బ్లాక్ బస్టర్ కి పేలవమైన స్క్రీన్ ప్లేకి చాలా సన్నని రేఖ అడ్డుగా ఉందని నిరూపించింది.. అని సమీక్షలో పేర్కొన్నారు. హిందుస్థాన్ టైమ్స్ ప్రకారం..ప్రభాస్ -పూజా హెగ్డే ప్రేమలో ఉన్న పామరుల చిత్రంలో ఏమీ అర్ధవంతం కాదు.. అంటూ వ్యంగ్యం ప్రదర్శించారు క్రిటిక్. రాధే శ్యామ్ చాలా యావరేజ్ మూవీ.
కథ మిమ్మల్ని నిరాశకు గురిచేస్తుంది. మనోహరమైన ప్రభాస్ మీరు దీన్ని చూడటానికి ఒక కారణాన్ని చెప్పొచ్చు. మిమ్మల్ని తిరిగి టైటానిక్ కి తీసుకెళ్లడానికి ఒక సీక్వెన్స్ ఉంది.. కానీ దాని గురించి పెద్దగా ఆలోచించకండి.. ఎందుకంటే హాలీవుడ్ చిత్రం హార్ట్ కోసం లాజిక్ ను త్యాగం చేయలేదు.. అంటూ పంచ్ లు విసిరారు.
ది హిందూ సమీక్ష ప్రకారం.. రాధే శ్యామ్ నిస్సారమైన కథ .. పేలవమైన స్క్రీన్ ప్లేతో గతి తప్పిందని విమర్శించారు. విధి ప్రేమ మధ్య సంఘర్షణ కీలకదశకు చేరుకున్నప్పుడు మూవీలో లాజిక్ కోల్పోయి ఆకర్షణను కోల్పోవడం ప్రారంభమవుతుంది.
రాధే శ్యామ్ తో ఉన్న అతి పెద్ద సమస్య ఏమిటంటే అది మిమ్మల్ని ఎప్పటికీ కథలోకి దించదు. ప్రభాస్ ను బాహుబలి పద్ధతిలో ఎత్తైన ఓడను స్కేల్ చేసేలా చేసినప్పటికీ సినిమా చివరలో ఉన్న షిప్ సీక్వెన్స్ ఇప్పటికే అస్థిరమైన చిత్రాన్ని పూర్తిగా ముంచేస్తుంది.. అంటూ సమీక్షలో విమర్శించారు.
న్యూస్ 18 సమీక్ష పరిశీలిస్తే.. సినిమాను యమ్ ఫెస్ట్ అని రాసారు. రాధే శ్యామ్ లోపాలను ప్రస్థావిస్తూ.. మొదట ప్రభాస్- పూజ మధ్య కెమిస్ట్రీ కనిపించదు. ప్రేమలో పడే వారి ప్రయాణం తరచుగా కొన్ని హాస్య సన్నివేశాలను జోడించడం కోసం ఆకస్మికంగా కట్ అవుతుంటుంది. ఇది ఎలాంటి నవ్వును పుట్టించేది లేదు.
రెండవది ప్రేమకథ తగినంతగా స్పష్టంగా లేదు. రెండు గంటలకు పైగా సాగే మెలికలు తిరిగిన గందరగోళం హృదయాల్ని గెలవడంలో విఫలమవడంలో ఆశ్చర్యం లేదు. చాలా అర్ధంలేని సన్నివేశాలు పాత్రలు ఉన్నాయి.. అంటూ విమర్శించారు. గొప్ప టైటిల్ పెట్టినా ఆశించినంతగా మెప్పించలేదని న్యూస్ మినిట్ విమర్శించింది.
ట్విట్టర్ లో మెజారిటీ అభిమానులు సినిమాను ఇష్టపడ్డారు. వారి ఆనందాన్ని పంచుకోవడానికి తమ హ్యాండిల్ లో సందడి చేశారు. అయితే కొందరు ఒక అడుగు ముందుకు వేసి రాధే శ్యామ్‌ని చూసిన తర్వాత తాము ఎంత నిరాశకు గురయ్యామో పంచుకున్నారు.