Begin typing your search above and press return to search.
పార్ట్ 2 విషయంలో ఆ పొరపాటు చేయరట
By: Tupaki Desk | 30 Jan 2019 5:54 AM GMTభారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన ఎన్టీఆర్ బయోపిక్ మొదటి భాగం ప్రేక్షకులను మెప్పించలేక డిజాస్టర్ గా నిలిచింది. ఈ సినిమా ఫలితం ఇలా కావడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి గానీ రిలీజ్ డేట్ కూడా అందులో తన వంతు పాత్ర పోషించిందని ఒక వాదన ఉంది. బుధవారం నాడు రిలీజ్ చేయడం ద్వారా ఓపెనింగ్ కలెక్షన్స్ తగ్గిపోయాయని.. వీకెండ్ మొదలయ్యే సరికే సినిమాపై ఫ్లాప్ అయిందని నెగెటివిటీ స్ప్రెడ్ కావడంతో సినిమా మళ్ళీ పుంజుకోలేకపోయిందని కొందరి భావన.
ఈ వెర్షన్ అంతా నిజమని ఒప్పుకోలేంగానీ కొంతవరకూ వాస్తవమైతే ఉంది. ఇదే విషయం ఫిలిం మేకర్స్ దృష్టికి కూడా వచ్చిందట. అందుకే మళ్ళీ అలాంటి పొరపాటు జరగకుండా వీకెండ్లోనే రెండో భాగాన్ని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. ఫిబ్రవరి 22 వ తేదీ శుక్రవారం నాడు 'ఎన్టీఆర్ మహానాయకుడు' చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్లానింగ్ జరుగుతోందట.
సెకండ్ పార్ట్ రిలీజ్ డేట్ ఇంకా అధికారికంగా ప్రకటించకపోయినా ఫిబ్రవరి 22 ను టార్గెట్ పెట్టుకొని పెండింగ్ షూట్ ఇతరత్రా వ్యవహారాలు చక్కబెడుతున్నారట. మొదటి భాగం సినిమాకు ఏవైతే కంప్లయింట్లు వచ్చాయో అవి మళ్ళీ రిపీట్ కాకుండా జాగ్రత్తపడుతున్నాడట దర్శకుడు క్రిష్. మరి ఈ చర్యలు ఏమేరకు సత్ఫలితాన్నిస్తాయో వేచి చూడాలి.