Begin typing your search above and press return to search.

రానా 1945 పరిస్థితి అలా ఉందట!

By:  Tupaki Desk   |   1 Feb 2019 6:38 AM GMT
రానా 1945 పరిస్థితి అలా ఉందట!
X
ఈ జెనరేషన్ స్టార్ కిడ్స్ అందరికీ రానా దగ్గుబాటి తనను తాను ప్యాన్ ఇండియా నటుడిగా మలుచుకున్న తీరు ఖచ్చితంగా ఒక ఇన్స్పిరేషనే. హీరోగా పెద్దగా విజయాలు లేని సమయంలో 'బాహుబలి' లో విలన్ రోల్ ను యాక్సెప్ట్ చెయ్యడమే కాకుండా.. హిందీ... తమిళం ఇలా అన్ని భాషల్లో నటించి నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. మళ్ళీ హీరోగా ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టులు సెట్ చేసుకున్నాడు.

'బాహుబలి' తర్వాత రానా సెట్ చేసుకున్న ప్రాజెక్టులలో పీరియడ్ ఫిలిం '1945' ఒకటి. ఈ తమిళ - తెలుగు ద్విభాషా చిత్రానికి సత్యశివ దర్శకుడు. బ్రిటిష్ కాలంనాటి నేపథ్యంలో సాగే కథ ఇది. సత్యరాజ్.. నాజర్ కీలకపాత్రలు పోషిస్తున్న ఈ సినిమాలో రెజీనా హీరోయిన్. అప్పట్లో కొచ్చి లో ఒక షెడ్యూల్.. శ్రీలంక లో మరో కీలకమైన షెడ్యూల్ కూడా పూర్తి చేశారని అన్నారు. చాలా రోజుల క్రితమే పూర్తి కావలసిన ఈ సినిమాకు సంబంధించి ఈమధ్య ఏవిధమైన అప్డేట్ లేదు. దాదాపు యాభై శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను ఫైనాన్షియల్ సమస్యల కారణంగా హోల్డ్ లో పెట్టారని సమాచారం.

నిర్మాతలు మళ్ళీ ఈ సినిమాను పట్టాలెక్కిస్తే రానా తన పోర్షన్ పూర్తి చేసేందుకు ఆసక్తిగా ఉన్నాడట. మరి ఈ సినిమాను నిర్మాత ఎస్. ఎన్. రాజరాజన్ మళ్ళీ సెట్స్ పైకి తీసుకెళతాడా లేదా అనేది వేచి చూడాలి.