Begin typing your search above and press return to search.

దేవరకొండ సినిమాకు టైమ్ కలిసొచ్చిందే!

By:  Tupaki Desk   |   22 Jun 2019 11:06 AM GMT
దేవరకొండ సినిమాకు టైమ్ కలిసొచ్చిందే!
X
విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ 'దొరసాని' సినిమాతో హీరోగా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో డాక్టర్ రాజశేఖర్ - జీవితల రెండో కుమార్తె శివాత్మిక ఈ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అవుతోంది. ఈ సినిమాను జూలై 12 తేదీ న విడుదల చేసేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.

ఈ సినిమా రిలీజ్ అయ్యే రోజే పూరి జగన్నాధ్ - రామ్ సినిమా 'ఇస్మార్ట్ శంకర్' కూడా షెడ్యూల్ అయి ఉంది. ఇదే కాకుండా సందీప్ కిషన్ 'నిను వీడని నీడను నేనే ' కూడా రిలీజ్ కానుంది. దీంతో 'దొరసాని' సినిమాకు బాక్స్ ఆఫీస్ దగ్గర గట్టి పోటీ తప్పదని అందరూ అనుకున్నారు. కానీ లక్కీగా రామ్ 'ఇస్మార్ట్ శంకర్' రేస్ నుండి తప్పుకుంది. 'ఇస్మార్ట్ శంకర్' ను నిర్మాతలు ఒక వారం పాటు వాయిదా వేయడంతో ఇటు 'దొరసాని' కి.. అటు 'నిను వీడని నీడను నేనే' సినిమాకు పెద్ద రిలీఫ్ వచ్చినట్టే. 'ఇస్మార్ట్ శంకర్' సినిమాపై మొదటి నుంచి పాజిటివ్ బజ్ ఉంది. పైగా మాస్ సినిమా కావడంతో 'దొరసాని' పై ఇంపాక్ట్ ఉండేది. ఇప్పుడు 'దొరసాని' ఆ ఇబ్బంది నుంచి తప్పించుకున్నట్టే. 'నిను వీడని నీడను నేనే' రిలీజ్ అవుతున్నా అది థ్రిల్లర్ జోనర్ కావడంతో ఈ లవ్ స్టొరీ సినిమాకు పెద్దగా పోటీ ఉండకపోవచ్చు.

అందుకే ఈ 'దొరసాని' టీమ్ ఫుల్ హ్యాపీగా ఉన్నారట. సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తే మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర సత్తా చూపడం ఖాయమేనని కాన్ఫిడెంట్ గా ఉన్నారట. 'దొరసాని' చిత్రానికి దర్శకుడు కేవీఆర్ మహేంద్ర కాగా నిర్మాత మథుర శ్రీధర్.