Begin typing your search above and press return to search.
రొమాన్స్ కి ఇక నయనతార చరమగీతం!
By: Tupaki Desk | 11 Jun 2022 1:30 AM GMTనయనతార-విగ్నేష్ శివన్ ఏడేళ్ల ప్రేమకి పుల్ స్టాప్ పడింది. నిన్నటితో ఎట్టకేలకు వివాహ బంధంతో ఒకటయ్యారు. ఇక పై భార్యాభర్తలు గా ప్రేక్షకుల్ని మెప్పించనున్నారు. ఇప్పుడేం చేసినా? అంతా అధికారికమే. రూమర్లు ఉండవు. భర్తతో ఎలా కలిసి జీవించాలన్నది ఇష్టా ఇష్టాలపై అధారపడి ఉంటుంది. వివాహ బంధంతో ఎన్నో మార్పులు చోటు చేసుకోవడానికి ఆస్కారం ఉంది.
కొన్ని రకాల స్వేచ్ఛల్ని సైతం కోల్పోవాల్సి ఉంటుంది. వృత్తిగతంగా నియమ నిబంధనలు పాటించాలా? వద్దా? అన్నది భార్య భర్తల నిర్ణయాలు..అభిప్రాయాల మీద ఆధారపడి ఉంటుంది. అయితే ఇక్కడ ఒకటి మాత్రం బలంగా చెప్పాలి. పెళ్లికి ముందున్నంత స్వేచ్ఛ ఉండదు. వ్యక్తిగతంగా కొన్ని పరిమితులు విధుంచుకోక తప్పదు. ఈ నేపథ్యంలో వెండి తెరపై నయన్ మునుపటి అంత గ్లామర్ మెరుపులు మెరిపించలదా? అంటే అందుకు ఛాన్సెస్ తక్కువగానే కనిపిస్తాయి.
విగ్నేష్ ని వివాహం చేసుకోవడానికి నయన్ పెద్ద యుద్ధేమే చేసింది.క్రైస్తవ మతం నుంచి హిందు మతంలోకి మారింది. పెళ్లికి ముందు ఎన్నో యజ్ఞయాగాలు చేసింది. హిందు ధర్మం ప్రకారం పాటించాల్సిన ఆచారాలు..దోష నివారణలో భాగంగా ప్రత్యేక పూజలు ఇలా ఎన్నోచేసింది. అన్ని విజయవంతంగా పూర్తి చేయడానికి ఎంతో సమయం తీసుకుంది. ఇలా కొంత ప్రాసస్ జరిగిన తర్వాత నయన్ కి పెళ్లి జరిగింది.
విగ్నేష్ తో ఎంతో జీవితాన్ని..బంగారు భవిష్యత్ ని డిజైన్ చేసుకుంది. ఈ నేపథ్యంలో నయనతార రొమాంటిక్ రొల్స్ కి చరమగీతం పాడినట్లే అని సంకేతాలు అందుతున్నాయి. ప్రస్తుతం చేతిలో ఉన్న ప్రాజెక్ట్ లు పూర్తిచేసి ఆ తర్వాత చాలా సెలక్టివ్ గా కెరీర్ ని ప్లాన్ చేసుకుంటుందని అంటున్నారు. లేడీ ఓరియేంటెడ్ పాత్రలు...నటనకు ఆస్కారం ఉన్న ఇమేజ్ రోల్స్ లోనే ఎక్కువగా కనిపించే అవకాశం ఉందని సంకేతాలు అందుతున్నాయి.
అలాగే భర్తతో కలిసి చిత్ర నిర్మాణంలో ప్రధాన భూమిక పోషించనుందని అంటున్నారు. తెరపై రొమాంటిక్ గా కనిపించడం విషయంపైనా చాలా జాగ్రత్తలు తీసుకునే అవకాశం కనిపిస్తుందని తెలుస్తోంది. నయనతార అవసరం మేర స్ర్కిప్ట్ డిమాండ్ మేరకు..దర్శకుల అభిరుచి మేరకు ఎలా నటించడానికైనా ఇన్నాళ్లు సిద్దంగానే ఉంది.
కానీ నయన్ బయట ఈవెంట్లకు హాజరయ్యేటప్పుడు మాత్రం చాలా సంప్రదాయంగా కనిపిస్తుంది. వీలైనంత ట్రెడీషనల్ గా కనిపించడానికే ఎక్కువగా ఇష్ట పడుతుంటుంది. సారీ...పంజాబీ డ్రెస్ లనే ఎక్కువగా వినియోగిస్తుంటారు. తాజాగా పెళ్లైన నేపథ్యంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది.
ప్రస్తుతం నయనతార బాలవుడ్ లో షారుఖన్ సరసన 'జవాన్' చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రంలో గ్లామర్ గా కనిపించే అవకాశం ఉంది. అలాగే మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటిస్తోన్న 'గాడ్ ఫాదర్' లోనూ నటిస్తుంది. కానీ చిరు సినిమాలో గ్లామర్ పాత్రకు ఆస్కారం ఉండదు కాబట్టి నయన్ సాప్ట్ గానే కనిపించే అవకాశం ఉంది.