Begin typing your search above and press return to search.
తెలుగులో నయన్ జోరు తగ్గినట్టేనా?
By: Tupaki Desk | 3 Jan 2021 5:30 PM GMTనయనతార .. దక్షిణాదిలో భారీ రెమ్యునరేషన్ అందుకుంటున్న హీరోయిన్. తెలుగు .. తమిళ .. మలయాళ భాషల్లో నయనతారకి మంచి క్రేజ్ ఉంది. ఈ మూడు భాషల్లోను ఆమె స్టార్ హీరోయిన్ గానే చక్రం తిప్పుతోంది. కెరియర్ తొలినాళ్లలో గ్లామర్ కి తొలి ప్రాధాన్యతనిస్తూ తెలుగులో వరుస సినిమాలు చేసుకుంటూ వచ్చిన నయనతార, ఆ తరువాత తమిళ సినిమాలపైనే ఎక్కువ కాన్సన్ ట్రేషన్ చేసింది. నటనకి ప్రాధాన్యతనిస్తూ పాత్రల పరంగా అక్కడ ఎన్నో ప్రయోగాలు చేసింది .. వీలైనన్ని హిట్లు మూటగట్టేసింది.
సీనియర్ స్టార్ హీరోల సరసన కథానాయికగా అలరించినా .. యువ హీరోల జోడీగా ఆడిపాడినా .. లేడీ ఓరియెంటెడ్ సినిమాలలో ప్రధానమైన పాత్రలను పోషించినా విజయం ఆమెను వెదుక్కుంటూ వచ్చేది. స్టార్ హీరోల సినిమాలతో సమానంగా ఆమె సినిమాలను థియేటర్స్ లో రిలీజ్ చేయడానికి నిర్మాతలు సిద్ధపడేవారంటే, ఆమె క్రేజ్ పై వాళ్లకి గల నమ్మకం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఈ క్రేజ్ కారణంగానే అరడజను తమిళ సినిమాల తరువాత ఒక తెలుగు సినిమా చేయడానికి కూడా ఖాళీ లేనంతగా ఆమె బిజీ అయ్యింది.
తెలుగులో బాలకృష్ణ .. వెంకటేశ్ .. చిరంజీవి వంటి సీనియర్ స్టార్ హీరోల సరసన మాత్రమే చేస్తూ వచ్చిన నయనతార, ఈ మధ్య మరీ నల్లపూసైపోయింది. 'లూసిఫర్' రీమేక్ కోసం ఆమెను సంప్రదిస్తున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి .. అందులో నిజం ఎంతనేది మాత్రం తెలియదు. ప్రస్తుతం తమిళ .. మలయాళ సినిమాలను మాత్రం చేసుకుంటూ వెళుతోంది. తమిళ సినిమాల అనువాదాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు టచ్ లోనే ఉంటోంది. నయనతారతో నేరుగా తెలుగు సినిమా చేయాలంటే ఆమెకు భారీ మొత్తంలో పారితోషికం చెల్లించాల్సి ఉంటుంది. అందువలన అందుబాటులో ఉన్న తమన్నా .. కాజల్ తోనే కానిచ్చేస్తున్నారు. ఒకప్పటిలా ఇప్పుడు ఇక్కడ నయన్ కోసం వెయిట్ చేసే పరిస్థితి కూడా లేదు. అందువలన తెలుగు తెరపై ఆమె జోరు తగ్గిందనే చెప్పుకోవాలి .. ఆమె మెరుపు తగ్గిందనే ఒప్పుకోవాలి.