Begin typing your search above and press return to search.
ఆ నెలని అనాథగా వదిలేశారే!
By: Tupaki Desk | 27 Sep 2019 2:30 PM GMTవస్తే హైదరాబాద్ వర్షాల్లా మీద పడుతూ వస్తాయి. లేకపోతే రాయలసీమ కరువులా ఆకలితో అల్లాడేలా చేస్తాయి. దేని గురించి అనుకుంటున్నారా. మన తెలుగు సినిమాల విడుదల తేదీల గురించి ఈ పోలిక అక్షరాలా సరిపోతుంది. ఒకేరోజు పోటీ పడుతూ నాలుగైదు సినిమాలు రిలీజ్ చేయడం ఒకదాని ప్రభావం మరొకదానిపై పడి వసూళ్లు రావడం లేదని మొత్తుకోవడం పరిపాటిగా మారింది.
సీజన్ పేరుతో వీళ్ళు చేస్తున్న హడావిడి వల్ల కలెక్షన్స్ వచ్చే మాట అటుంచి కనీసం థియేటర్ల ఫీడింగ్ కూడా పనికిరావడం లేదు.పోనీ పాజిటివ్ టాక్ వచ్చినవి ఏమైనా లాంగ్ రన్ తెచ్చుకుంటున్నాయా అంటే అదీ లేదు. అంతా వారం రోజుల ముచ్చటగా మారిపోయింది. అందుకే నెలకు ఒకటి లేదా రెండు హిట్స్ వచ్చాయి అని చెప్పుకోవడమే గగనమైపోయింది
పరిస్థితి ఇలా ఉంటె మన నిర్మాతలు నవంబర్ ని పూర్తిగా వదిలేయడం ఆశ్చర్యం కలిగించే విషయం. ఇప్పటిదాకా చెప్పుకోదగ్గ ఏ సినిమానీ నవంబర్ కి షెడ్యూల్ చేయలేదు. అక్టోబర్ లో సైరాతో ఆపై చాణక్య తో కంటిన్యూ చేస్తూ వెంకీ మామ దాకా అన్ని క్యూలో పెట్టారు కానీ ఎవరూ ఆ పై వచ్చే నెలని ఏ నిర్మాతా టార్గెట్ చేయడం లేదు.
ఎంత డ్రై మంత్ అనుకున్నా జనం మరీ సినిమాలు చూడకుండా ఉండే పీరియడ్ కాదు. బాగుందంటే నెలతో సంబంధం లేకుండా ఆదరించిన సందర్భాలు గతంలో ఎన్నో ఉన్నాయి. మరి ఇప్పుడీ నవంబర్ ను ఎందుకు వదిలేస్తున్నారో అంతు చిక్కడం లేదు. మరోవైపు డిసెంబర్ లో వారానికో రెండు మూడు సినిమాలు వచ్చేలా ప్లాన్ చేసుకుంటున్నారు. ఇప్పటికైనా ఓ అండర్ స్టాండింగ్ తో నవంబర్ మీద జాలి చూపిస్తే సినిమా ప్రేమికులు ఊరట చెందుతారు.