Begin typing your search above and press return to search.

వినాయక్ తో సినిమానా? లేదబ్బా!!

By:  Tupaki Desk   |   21 Jun 2017 8:57 AM GMT
వినాయక్ తో సినిమానా? లేదబ్బా!!
X
ఇప్పుడు రానా దగ్గుబాటి తన తదుపరి రిలిజ్ అయిన ''నేనే రాజు నేనే మంత్రి''పై ఫుల్ ఫోకస్ తో పనిచేస్తున్నాడు. ఈ సినిమాను దర్శకుడు తేజ కూడా ఎంతో ప్రతిష్ఠాత్మకంగా రూపొందిస్తున్నాడట. అలాగే ఇది కాజల్ అగర్వాల్ కు 50వ సినిమా కావడం.. తనకు టాలీవుడ్ లో జన్మనిచ్చిన తేజ సినిమా కావడంతో.. ఆమె కూడా చాలా ఛాలెంజింగ్ గానే తీసుకుంది.

ఇకపోతే ఒక స్టన్నింగ్ రూమర్ ఏంటంటే.. ఈ సినిమా తరువాత రానా దగ్గుబాటి.. స్టార్ డైరక్టర్ వివి వినాయక్ డైరక్షన్లో ఒక సినిమా చేస్తున్నాడనే టాక్ వచ్చింది. అసలు వినాయక్ చెప్పిన పవర్ ఫుల్ మాస్ కథకు రానా వెంటనే ఓకె చెప్పేశాడని.. వినాయక్ కోసం తగిన నిర్మాతను వెతికే పనిలో డాడ్ సురేష్‌ బాబు నిమగ్నమయ్యారని రూమర్ కూడా వచ్చింది. అయితే ఇదంతా నిజమేనా?? అదే విషయం రానాను అడిగితే.. ''ఏవండి.. నేను ఏదన్నా కొత్త సినిమా చేస్తే వెంటనే ట్విట్టర్లో ప్రకటిస్తా. దానికి పెద్ద దాపరికం ఏముంది. అనవసరమైన రూమర్లను ప్రమోట్ చేయకండి'' అంటూ సెలవిచ్చాడు. అంటే వినాయక్ తో సినిమా అనేది కేవలం ఒక రూమరే అనమాట.

ప్రస్తుతం రానా కేవలం నేనే రాజు నేనే మంత్రి సినిమా గురించి తప్పించి.. దేని గురించీ ఆలోచించట్లేదట. ఈ సినిమా తరువాతే మరో సినిమా గురించి ఆలోచిస్తాడట. ఇప్పటికైతే.. ఎల్లుండ రిలీజ్ అవ్వబోయే డిజె దువ్వాడ జగన్నాథమ్ సినిమాతో పాటే ధియేటర్లలో ఈ నేనే రాజు నేనే మంత్రి ట్రైలర్ కూడా ప్రదర్శించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. జూన్ 23న ఉదయం 10 గంటలకు ట్రైలర్ ఆన్ లైన్లో కూడా లాంచ్ చేస్తారట.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/