Begin typing your search above and press return to search.
బాక్స్ ఆఫీస్ కు బాక్సుల కరువు
By: Tupaki Desk | 20 March 2019 5:51 AM GMTఏదైనా ప్రాంతానికి కరువు వచ్చి నీళ్ళు తిండి వగైరా దొరక్కపోవడం సహజం. కాని సినిమాలు లేక బాక్స్ ఆఫీస్ కరువుతో అల్లాడిపోతున్న పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తోంది. మరునాడు శుక్రవారం రావాల్సిన లక్ష్మీస్ ఎన్టీఆర్ మరోవారం వాయిదా పడటంతో ట్రేడ్ సైతం ఉస్సూరుమంది. దీంతో చీకటి గదిలో చితక్కొట్టుడు అనే అడల్ట్ బూతు కంటెంట్ తప్ప ఇంకే ఆప్షన్ లేకుండా పోయింది. ట్రైలర్లోనే ఓ రేంజ్ మసాలా చూపించేసిన టీం ఇటీవల వదిలిన స్నీక్ పీక్ వీడియోలు ఇంకా శృతి మించినట్టు అనిపించాయి.
ఈ నేపధ్యంలో దీన్ని యూత్ తప్ప ఇంకే వర్గం ఆడియన్స్ ఓపెనింగ్స్ ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు. మూడు వారాల నుంచి ఇదే పరిస్థితి కొనసాగుతుండటంతో చాలా చోట్ల సింగల్ స్క్రీన్ ఎగ్జిబిటర్లు తమ థియేటర్లను ప్రత్యాన్మయ ఆదాయ వనరులగా మార్చుకునే దిశగా సీరియస్ చర్చల్లో ఉన్నట్టు సమాచారం. ఇలా నెలా రెండు నెలలు ఖాళీ హాళ్ళతో సిబ్బందికి జీతాలిచ్చి పోషించే స్థితి లేదని అందుకే షాపింగ్ కాంప్లెక్స్ లేదా ఏదైనా ఫంక్షన్ హాల్ తరహలో మార్చుకుంటే నికరమైన గ్యారెంటీ ఆదాయం ఉంటుందన్న ఆలోచన ఉందని టాక్
సో ఈ వారం ఈ చీకటి గదిలో మగ్గడం తప్ప ఏదో ఒక సినిమా చూడనిదే వారం గడవని ప్రేక్షకులకు ఇంకో మార్గం లేదు. సినిమా ఎలా ఉండబోతోంది అనేది అరటిపండు వలిచినట్టు పోస్టర్స్ లో ట్రైలర్స్ లో ముందే చెప్పేశారు కాబట్టి అంతకు మించి ఏదైనా ఆశించడం కూడా తప్పే అవుతుంది. గత వారం వచ్చిన వాటిలో హారర్ మూవీ జెస్సీకి అంతో ఇంతో పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ పబ్లిసిటీ లోపం వల్ల కనీస వసూళ్లు కూడా దక్కడం లేదు. కొనసాగడం కూడా కష్టంగానే ఉంది. నెక్స్ట్ ఫ్రైడే లక్ష్మీస్ ఎన్టీఆర్ వచ్చే దాకా ఇదిలాగే కొనసాగుతుంది. అదీ ఫస్ట్ షోకి బాగుందని టాక్ వస్తేనే సుమా. లేదంటే ఏప్రిల్ 5 మజిలి వచ్చే దాకా రోజులు భారంగా గడపక తప్పదు